ఏపీలో ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలలు సమయం ఉన్నప్పటికి రాష్ట్ర రాజకీయాలు ఏ స్థాయిలో వేడి పుట్టిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని పక్కా ప్రణాళికలతో ముందుకు సాగిన టీడీపీకి ఊహించని విధంగా చంద్రబాబు స్కిల్ స్కామ్ బ్రేకులు వేసింది.
స్కిల్ స్కామ్ లో చంద్రబాబు( Chandrababu Naidu ) రిమాండ్ కు వెళ్ళకముందు చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలు, లోకేశ్ పాదయాత్రలు( Nara lokesh ) చేస్తూ పార్టీకి మంచి మైలేజ్ తీసుకొచ్చారు.మినీ మేనిఫెస్టో అని అందరికంటే ముందే హామీలను ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని ముందే స్టార్ట్ చేశారు.
ఇక యమ స్పీడ్ మీద ఉన్న టీడీపీకి చంద్రబాబుపై స్కిల్ స్కామ్ ఆరోపణలు సడన్ బ్రేక్ వేశాయి.
కేవలం ఆరోపణలు మాత్రమే కాకుండా సీఐడీ రిమాండ్ కూడా విధంచడంతో టీడీపీ అధినేత జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఫలితంగా పర్యటనలు ఆగిపోయాయి లోకేశ్ పాదయాత్ర హోల్డ్ లో పడింది.టీడీపీ ప్రణాళికలు, ప్లాన్స్ అన్నీ కూడా పటాపంచలు అయ్యాయి.
వ్యూహాత్మకంగా టీడీపీ వ్యూహాలకు చెక్ పెట్టడంలో జగన్ సక్సస్ అయ్యారనే చెప్పాలి.ఇప్పుడు టీడీపీ స్థానాన్ని పూర్తిగా భర్తీ చేసేందుకు వైసీపీ ప్రచారానికి శ్రీకారం చుట్టబోతుందట.
త్వరలేనే ” పల్లెకు పోదాం( Palleku Podam ) ‘ అనే కార్యక్రమనికి జగన్( YS Jagan Mohan Reddy ) సిద్దమౌతున్నట్లు టాక్.అలాగే ఇక నియోజిక పర్యటనలు కూడా చేసేందుకు జగన్ పక్కా ప్రణాళికలు రెడీ చేసుకున్నారట.
ఎక్కడ టీడీపీ ప్రస్తావనే లేకుండా మొత్తం ప్రజల నోట వైసీపీ మాటే వినిపించేలా ప్రచారాలు నిర్వహించాలా జగన్ ప్లాన్ చేశారట.కాగా “ ఇంటింటికి మన ప్రభుత్వం “, మా తోడు నువ్వే జగన్ వంటి కార్యక్రమాలు ప్రజల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.దాంతో ఈసారి చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా ప్రజల్లో పూర్తి మద్దతు లభించేలా రెడీ చేశారట అధినేత జగన్మోహన్ రెడ్డి.మరి ఎన్నికల్లో 175 సీట్లలో గెలుపే లక్ష్యంగా ఉన్న వైసీపీ అధినేత.
ఎన్నికల ముందే టీడీపీని కట్టడి చేయడంలో కొంత సక్సస్ అయ్యారు.ఇప్పుడు తాజా పరిస్థితులను వైసీపీకి అనుకూలంగా మార్చుకొని తిరుగులేని విజయం సాధించాలని జగన్ ప్లాన్ చేశారు.
మరి ఆయన వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.