ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన 'లియో'.. అక్కడ గ్రాండ్ రిలీజ్!

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్( Thalapathy Vijay ) కు తెలుగులో కూడా ఫాలోయింగ్ ఉంది.అందుకే ఈయన సినిమాలు మన దగ్గర కూడా భారీ స్థాయిలోనే రిలీజ్ చేస్తుంటారు.

 Vijay And Lokesh Kanagaraj's Leo Movie Update, Thalapathy 67, Thalapathy Vijay,-TeluguStop.com

మంచి టాక్ వస్తే ఇక్కడ కూడా బాగానే కలెక్షన్స్ రాబడతారు.ఈ ఏడాది వారిసు సినిమాతో విజయం సాధించిన విజయ్ మరో సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు.

విజయ్ ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ( Lokesh Kanagaraj )దర్శకత్వంలో ‘లియో’ సినిమా చేస్తున్నాడు.భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా తమిళ్ ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్ట్ లలో ఒకటిగా తెరకెక్కుతుంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా ఈ సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియెన్స్ ను అలరించి అంచనాలు అమాంతం పెంచేసింది.

Telugu Leo, Thalapathy, Trisha, Vijaylokesh-Movie

ఇటీవలే ఈ సినిమా ఐమాక్స్ వర్షన్ గురించి అప్డేట్ ఇచ్చారు.ఈ సినిమాను యూఎస్ డిస్టిబ్యూటర్స్ అక్కడ ఐమాక్స్ ఫార్మాట్ లో రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.ఈ క్రమంలోనే తాజాగా లియో సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా ( RRR movie )రికార్డును బీట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

అప్పట్లో ఆర్ఆర్ఆర్ సినిమా యూఎస్ లో నెవర్ బిఫోర్ రేంజ్ లో రాజమౌళి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

Telugu Leo, Thalapathy, Trisha, Vijaylokesh-Movie

మరి ఇప్పుడు లోకేష్ కూడా లియో( LEO Movie ) కోసమా అంతకంటే గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.అక్కడ ఐమాక్స్ స్క్రీన్స్ లో దాదాపు 80 స్క్రీన్స్ లో ఆర్ఆర్ఆర్ రిలీజ్ కాగా ఇప్పుడు ఈ రికార్డ్ ను బ్రేక్ చేసే విధంగా విజయ్ లియో రిలీజ్ అవుతున్నట్టు టాక్.80కి పైగానే ఐమాక్స్ స్క్రీన్స్ ఈ సినిమా కోసం దక్కాయని తెలుస్తుంది.కాగా సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష( Trisha ) హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాను అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube