టీడీపీ అధినేత చంద్రబాబు పీటీ వారెంట్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో సోమవారం విచారణ జరగనుంది.చంద్రబాబుకు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లతో పాటు పీటీ వారెంట్లపై కోర్టు విచారణ చేపట్టనుంది.
అయితే ఏపీ ఫైబర్ గ్రిడ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఏసీబీ కోర్టులో సీఐడీ పీటీ వారెంట్లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే టెర్రా సాఫ్ట్ కి అక్రమంగా టెండర్లు ఇచ్చారని సీఐడీ ఆరోపించింది.
అందులో చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా పేర్కొందని తెలుస్తోంది.ఈ క్రమంలో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్లను విచారణకు స్వీకరించిన ఏసీబీ కోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది.