జబర్దస్త్( Jabardast ) ఎంతోమంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన షో గా చరిత్రలో నిలిచిపోయింది.ఎవరు అవునన్నా కాదన్నా జబర్దస్త్ ఒక మంచి టిఆర్పి రేటింగ్ వచ్చే షో అని ఒప్పుకోవాల్సిందే.
ఈటీవీ కి ఏకైక కామెడీ షో గా అలాగే మంచి రియాల్టీ షో( A reality show ) గా కూడా మిగిలిపోయింది.నాటికి నేటికి అదొక విజయవంతమైన షో గా ఎక్కడ ఆటంకం లేకుండా నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది.
జబర్దస్త్ ద్వారా ఎంతో మంది నటీనటులు, కమెడియన్స్ వెండితెరక కూడా పరిచయం కావడం విశేషం.జబర్దస్త్ కు దీటుగా మిగతా చానల్స్ ఎన్నో కామెడీ రియాలిటీ షోలు ప్లాన్ చేసినా కూడా అవేవీ జబర్దస్త్ దరిదాపుల్లోకి వెళ్లలేదు అంటే జబర్దస్త్ యొక్క పాపులారిటీ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు.
జబర్దస్త్ షోకి ప్రస్తుతం రకరకాల యాంకర్స్ వస్తున్నారు పోతున్నారు కానీ ఈ షో కి ఇంత డిమాండ్ రావడానికి ఈ మొట్టమొదటగా పోస్ట్ చేసిన అనసూయ( Anasuya ) ఖచ్చితంగా ఒక కారణం అని చెప్పుకోవచ్చు.ఆమె చిట్టి పొట్టి డ్రెస్సుల్లో అంగాంగ ప్రదర్శన చేసి ఒక కామెడీ షో కూడా ఇలా చేయొచ్చు అని టీవీ ఇండస్ట్రీ దుమ్ము దులిపేసే విధంగా అద్భుతమైన హొస్టింగ్ తో ఈ షోను రక్తి కట్టించడంలో అనసూయ సక్సెస్ అయ్యింది.అనసూయ తో పాటు రష్మీ( Rashmi ) కూడా బాగానే ఈ షోని రక్తి కట్టించింది.ఆ తర్వాత యాంకర్స్ మారుతున్న ప్రస్తుతం ఎంతో కొంత డిమాండ్ అయితే పడిపోతూ వస్తుంది అయితే జబర్దస్త్ గురించి చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఇది బాలీవుడ్ కామెడీ సర్కస్( Bollywood Comedy Circus ) అనే షోకి రీమేక్ గా తెలుగులో జబర్దస్త్ పేరుతో మొదలు పెట్టబడింది.
2012లో శ్యాంప్రసాద్( Shyamprasad ) ఏదో ఒక రియాల్టీ షో చేయాలి అనుకుంటున్న టైంలో తరరంపం అనే ఒక సింగింగ్ షో కి రూపకల్పన చేశాడు.ఈ షోకి హేమచంద్రను మరియు అనసూయను హొస్టులుగా తీసుకోగా అప్పటికే హేమచంద్రకు శ్రావణ భార్గవి తో నిశ్చితార్థం కావడంతో అనసూయ స్థానంలో శ్రావణ భార్గవి అయితే బాగుంటుందని అలా అయితే తమ జోడికి క్రేజ్ పెరుగుతుందని చెప్పడంతో వేరే ఆప్షన్ లేక హేమచంద్ర అనసూయ శ్రావణ భార్గవిలతో రన్ చేశారు.ఆ తర్వాత కొన్ని రోజులకే ఈటీవీలో వీర అనే ప్రోగ్రాం అయిపోతుండడంతో దాని స్థానంలో జబర్దస్త్ స్టార్ట్ చేశారు.అయితే ఈ షో కోసం ఒక ఎపిసోడ్ కి అనసూయకు మూడువేల రూపాయల చొప్పున మాట్లాడుకోగా తెల్లవారితే షో మొదలవుతుంది అనగా 5000 ఇస్తే తప్ప ఒప్పుకోనని మొండికేసింది అనసూయ.
దాంతో ప్రాజెక్ట్ హెడ్ మరియు డైరెక్టర్ కి వేరే ఆప్షన్ లేక అనసూయకు 5000 ఇచ్చి ఈ షో ని మొదలుపెట్టారు.