దేశంలో జమిలి ఎలక్షన్స్( Jamili Elections ) రాబోతున్నాయని, ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్ నినాదంతో దేశమంత ఒకేసారి ఎలక్షన్స్ నిర్వాహించేందుకు మోడీ సర్కార్ సిద్దమైందని గత కొన్నాళ్లుగా దేశ వ్యాప్తంగా ఎంతటి దుమారం రేగిందో అందరికీ తెలిసిందే.జమిలి ఎలక్షన్స్ అమలు కై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్( Ramnath Kovind ) అద్యక్షతన ఓ కమిటీని కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగత విధితమే.
ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశంలో జమిలి ఎలక్షన్స్ పై బిల్లు ప్రవేశ పెట్టె అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చాయి.కానీ అందరి ఆలోచనలు తలకిందులు చేస్తూ జమిలి ఎలక్షన్స్ పై కాకుండా మహిళా బిల్లును ప్రవేశ పెట్టి అందరినీ ఆశ్చర్య పరిచింది మోడీ ప్రభుత్వం.
అయితే జమిలి ఎలక్షన్స్ పై కూడా బిల్లు ప్రవేశ పెడుతుందేమో అని ఊహించారంత కానీ ఎవరు ఊహించని విధంగా మహిళా బిల్లు( Women Reservation Bill ) ఆమోదం పొందిన తరువాత పార్లమెంట్ సమావేశాలను నిరువదిక వాయిదా వేసి అందరికీ షాక్ ఇచ్చింది మోడీ సర్కార్.దీన్ని బట్టి జమిలి ఎలక్షన్స్ పై మోడీ సర్కార్( PM Modi ) వెనుకడుగు వేసిందా అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయ్హి.ఒకవేళ జమిలి ఎలక్షన్స్ విషయంలో వెనక్కి తగ్గే ఆలోచన ఉంటే రామ్నాథ్ కొవింద్ అద్యక్షతన కమిటీ ఎందుకు వేయాల్సి వచ్చింది అనే ప్రశ్న కూడా ఉత్పన్నమౌతోంది.జమిలి ఎలక్షన్స్ సాధ్యం కావు అనే ఉద్దేశ్యంతోనే పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెత్తకుండా మోడీ సర్కార్ వెనుకడుగు వేసిందా అని ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
నిజానికి జమిలి ఎలక్షన్స్ అనే ప్రతిపాదన సరైనది కాదని విశ్లేషకులు మొదటి నుంచి చెబుతున్నారు.ఎందుకంటే రాష్ట్రల వారీగా ఎన్నో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న మనదేశంలో అన్నీ రాష్ట్రలలోని ప్రభుత్వాలను ఒకే తాటిపైకి తీసుకు రావడం కష్టమైన పనే.అంతే కాకుండా ఒకవేళ జమిలి ఎలక్షన్స్ అమలైతే.అనూహ్యంగా ఏదో ఒక రాష్టంలో ప్రభుత్వం రద్దు అయ్యే పరిస్థితి ఏర్పడినప్పడు ఎలక్షన్స్ ఎలా నిర్వహించాలనేది కూడా ఒక చిక్కు ప్రశ్నే.
అందుకే ఇప్పుడప్పుడే జమిలి ఎలక్షన్స్ పై తుది నిర్ణయం తీసుకోకూడదని మోడీ సర్కార్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.మరి ముందు రోజుల్లో జమిలి ఎలక్షన్స్ అమలుకు అడుగులు పడటాయా ? లేదా వర్కౌట్ అక్ని అంశామని మోడీ సర్కార్ విరమించుకుంటుందా ? అనేది చూడాలి
.