ఈ యాప్స్‌ డౌన్‌లోడ్ చేయొద్దు... పాక్ హ్యాకర్ల దాడులు ఎక్కువైపోయాయి!

బహుపరాక్! మీరు ఇక్కడ విన్నది నిజమే.పాకిస్థాన్‌కు( Pakistan ) చెందిన స్కామర్లు ఈమధ్య కాలంలో పెచ్చుమీరి ప్రవర్తిస్తున్నారు.

 Pak-linked Hackers Targets Indians Spreading Malware Via Fake Youtube Apps Detai-TeluguStop.com

ముఖ్యంగా వీళ్ళు ఎప్పుడు భారతీయుల సంక నాకుతూ వుంటారు.ఈ క్రమంలోనే తాజాగా పాకిస్థాన్‌కు చెందిన మరో హ్యాకర్ల గ్రూప్ ఇండియన్స్‌పై కన్నేసిందని ఇంటెలిజెన్స్ వర్గాలు అంటున్నాయి.

“ట్రాన్స్పెరంట్ ట్రైబర్‌”( Transparent TRIBER ) అని పిలిచే ఈ గ్రూప్‌కు చెందిన హ్యాకర్లు సెల్ఫ్-రన్ వెబ్‌సైట్లు, సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్స్‌తో భారతదేశంలోని ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో మాల్వేర్లను వ్యాప్తి చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇందుకు 3 ఫేక్ యూట్యూబ్ యాప్‌లను పాక్ హ్యాకర్లు ఉపయోగిస్తున్నారని సైబర్‌ సెక్యూరిటీ సంస్థ సెంటినెల్‌వన్ తాజాగా గుర్తించడం జరిగింది.

ఈ ఫేక్ అప్లికేషన్లతో పంపించే మాల్వేర్‌ను( Malware ) కాప్రారాట్ అని పిలుస్తారు.ఇది రిమోట్ యాక్సెస్ ట్రోజన్(RAT), అంటే ఇది హ్యాకర్లకు ఇన్ఫెక్టెడ్ డివైజ్‌పై ఫుల్ కంట్రోల్ ఇస్తుంది.

మరీ ముఖ్యంగా కశ్మీర్‌లోని వివాదాస్పద ప్రాంతానికి సంబంధించిన వ్యవహారాల్లో నిమగ్నమైన వ్యక్తులు, పాకిస్థాన్ సంబంధిత విషయాలపై దృష్టి సారించే మానవ హక్కుల కార్యకర్తలు వంటి వారిని హ్యాకర్లు లక్ష్యంగా పనిచేస్తున్నట్టు సమాచారం.డివైజ్‌కు CapraRAT సంక్రమించాక హ్యాకర్లు కాంటాక్ట్స్, ఫోటోలు, మెసేజ్‌లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తారు.

Telugu Attack, Caprarat, Youtube Apps, India, Indians, Kashmir, Malware, Pak Hac

హ్యాకర్లు ఈ రకమైన ఫేక్ ఆండ్రాయిడ్ యాప్‌లను ఉపయోగించి భారతీయ విద్యా రంగంలోని వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారు.ఒకసారి హానికరమైన యాప్స్‌ లిస్ట్ కింద ఇవ్వబడింది చూడండి.

1.com.moves.media.tubes
2.com.videos.watchs.share
3.com.Base.media.service

Telugu Attack, Caprarat, Youtube Apps, India, Indians, Kashmir, Malware, Pak Hac

ఈ పై యాప్‌లను ఎట్టి పరిస్థితులలోనూ డౌన్‌లోడ్ చేయవద్దు లేదా ఇన్‌స్టాల్ చేయవద్దు అని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.ఈ మాల్వేర్ నుంచి రక్షించుకోవడానికి అఫీషియల్ గూగుల్ ప్లే స్టోర్ ( Google Play Store ) నుంచి మాత్రమే యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.ఈ-మెయిల్స్‌, మెసేజ్‌ల్లోని లింక్‌లను క్లిక్ చేయకూడదు.

ఈ ట్రాన్స్పెరంట్ గ్రూప్‌కు పాకిస్థాన్, భారతదేశం రెండింటిలోనూ దౌత్య, సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకున్న చరిత్ర ఉంది.ఈ హ్యాకర్లు వ్యక్తుల ఫోన్ల నుంచి డేటాను దొంగిలించడానికి CapraRAT టూల్ ఉపయోగిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube