కురుక్షేత్రాన్ని తలపిస్తున్న ఏపీ అసెంబ్లీ !

ప్రధాన ప్రతిపక్ష నేత అరెస్టు తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ సమావేశాలు కావడంతో ఏసీ అసెంబ్లీ సమావేశాలు కురుక్షేత్రాన్ని తలపిస్తున్నాయి .తొడలు కొట్టడాలు మీసం మేలేయడాలు లాంటి చర్యలతో ప్రజా సమస్యలను చర్చకు పెట్టాల్సిన అసెంబ్లీ స్థలాన్ని యుద్దానికి సిద్ధంగా ఉన్న రణస్థలం లా మార్చేశారు అధికార ప్రతిపక్ష నేతలు .

 Ap Assembly Is Replecting Kurukshetra, Ambati Rambabu , Ap Assembly, Ap Politi-TeluguStop.com

ముందుగా చంద్రబాబు అరెస్టుపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలని తెలుగుదేశం సభ్యులు చేసిన డిమాండ్ ని స్పీకర్ఆమోదించలేదు .దాంతో స్పీకర్ పోడియం ను చుట్టుముట్టిన తెలుగుదేశం నేతలు తమ నిరసనను వ్యక్తం చేశారు.దీంతో కలగజేసుకున్న శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి బిసియే సమావేశంలో కూర్చుని చర్చించి నిర్ణయించుకుని అన్ని అంశాలపై చర్చిద్దామనిప్రతిపాదించారు .చంద్రబాబు అరెస్టుపైనే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్( Skill development scam ) లో జరిగిన అవినీతిని ,అమరావతి రింగ్ రోడ్డు అలైన్మెంట్ చేంజ్ విషయంలో జరిగిన అవినీతిని, ఫైబర్ గ్రిడ్ స్కామ్ లో జరిగిన అవినీతిని ఇలా అన్ని విషయాలను కూలంకషంగా చర్చిద్దాం అంటూ చెప్పుకొచ్చారు.

Telugu Ambati Rambabu, Ap Assembly, Ap, Balakrishna, Skill Scam, Ys Jagan-Telugu

ఆ తర్వాత మాట్లాడిన అంబటి రాంబాబు( Ambati Rambabu ) టిడిపి సభ్యుల ప్రవర్తన అవాంఛనీయమని , అమానుషంగా ఉందని మాట్లాడుతుండగా బాలయ్య పరుషంగా కొన్ని సైగ లు చేశారని, చూసుకుందాం.రా అంటూ మీసం మేలేసారంటూ అంటూ అధికార పక్ష నేతలు చెబుతున్నారు.దీంతో సభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి .శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అయితే బాలకృష్ణ( Balakrishna )ను ఉద్దేశిస్తూ తోడగొట్టడం గమనార్హం .దాంతో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదము చోటుచేసుకుంది.దాంతో స్పీకర్ ముగ్గురు తెలుగు దేశం ఎమ్మెల్యేలను మొత్తం అసెంబ్లీ సమావేశాల నుంచి మిగతా ఎమ్మెల్యేలను ఒకరోజు సస్పెండ్ చేశారు.

దాంతో అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి.

Telugu Ambati Rambabu, Ap Assembly, Ap, Balakrishna, Skill Scam, Ys Jagan-Telugu

అయితే అసెంబ్లీలో సభ్యుల ప్రవర్తన పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ప్రజాధనాన్ని జీతం గా తీసుకునే ఎమ్మెల్యేలు ,అత్యంత విలువైన శాసనసభ సమయాన్ని ఇలా దుర్వినియోగం చేస్తున్నారని, వ్యక్తిగత పగలు, ప్రతీకారాల కోసం ప్రజా ధనంతో పాటు సమయాన్ని వృధా చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube