ఖలిస్తాన్ ఏర్పాటు కోసం కెనడా లో ఉద్యమాలు చేస్తున్న హరదీప్ నిజ్జార్ హత్య( Hardeep sing nijjar ) వెనక భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఉన్నాయని కెనడా పార్లమెంట్లో ఆ దేశ అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో( Justin Trudeau ) చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే .దీనిపై భారత్ కూడా అదే స్థాయిలో దీటుగా స్పందించింది.
దాంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత లు తారాస్థాయికి చేరుకున్నాయి.రాయబారులను వాపస్ చేయడం, వాణిజ్య చర్చలు నిలిపివేయడంతో పరిస్థితి చెయ్యి దాటి పోయే వాతావరణం కనిపిస్తుంది.
మరోపక్క వీసాల జారిని కూడా ఇరుదేశాలు నిలిపివేశాయి .అయితే భారత్ తో బాహా బాహీ కి తలపడుతున్న కెనడాకి దాని మిత్ర దేశాల నుంచి మద్దత్తు కొరవడడం మాత్రం ఆసక్తి ని కలిగిస్తుంది.నిజానికి పశ్చిమ దేశాల కూటమి లో కెనడా అతి కీలక బాగ స్వామి .ప్రపంచం లోనే అదునాతన ఆర్దిక కూటమి గా జీ -7 కూటమి కి పేరు ఉంది.అందులో కనడా బాగస్వామి .

అంతేకాకుండా అమెరికా నేతృత్వంలోని నాటో కూటమిలో కూడా కెనడా కీలక భాగస్వామి.అంటే ఈ కూటమి లో ని ఏదైనా ఒక దేశం యుద్దానికి తెరతీస్తే నాటో లోని మిగిలిన సభ్య దేశాలు దానికి తప్పనిసరి గా మద్దత్తు ఇవ్వాలి .అంతేకాకుండా అత్యంత కీలకమైన ఫైవ్- ఐ ఇంటెలిజెన్స్ షేరింగ్ దేశాలైన యూకే, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ ,అమెరికా ల కూటమి లో కూడా కెనడా భాగస్వామి.అంటే ఈ ఐదు దేశాల మధ్య ఇంటెలిజెన్స్ వ్యవస్థ షేరింగ్ ఏర్పాటు కూడా ఉంది .అయితే ఇంతటి కీలకమైన స్థానంలో ఉన్నా కూడా కెనడాకు బారత్ తో వివాదం విషయంలో మాత్రం ఈ దేశాల కనీస మద్దతు దక్కలేదు.

బ్రిటన్ బారత్( India ) తో వాణిజ్య చర్చలు కొనసాగుతాయని ప్రకటించగా, అమెరికా( America ) మాత్రం జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని మాత్రం తటస్థంగా స్పందించింది .అయితే భారత చర్యలపై ఉమ్మడిగా ఖండన చేయ్యాలన్న కెనడా వినతులను మాత్రం ఈ మిత్ర దేశాలు పట్టించుకోలేదు.ఆసియా ఖండంలో అత్యంత కీలక భాగస్వామి అయిన బారత్ తో శత్రుత్వాన్ని ఈ దేశాలు కోరుకోవడం లేదని తెలుస్తుంది.అంతేకాకుండా పసిఫిక్ రీజియన్ లో చైనాను నిలువరించాలంటే భారత్ లాంటి కీలక భాగస్వామి అవసరమని ఈ పశ్చిమ దేశాలకు స్పష్టమైన ఎరుక వుంది.
అందువల్లే ఈ వివాదంలో ఈ దేశాలన్నీ తటస్థ వైఖరిని అవలంబిస్తున్నాయి.అయితే ఈ పరిస్థితులు ఇలానే కొనసాగి మరింత ఉద్రిక్తతం గా మారితే మాత్రం అంతర్జాతీయ దౌత్య సంబంధాలలో కూడా గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తుంది .మరి సహజంగా దౌత్య సంబంధాల విషయంలో రక్షణాత్మక వైఖరిని అవలంబించే భారత్ జరుగుతున్న పరిణామాల విషయంలో ఎలాంటి వైఖరి అవలంబిస్తుందో చూడాలి.







