ప్రస్తుత సమాజంలో చాలామంది ప్రజలు అధిక బరువు సమస్య( Overweight Problem )తో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు.ఇంకా చెప్పాలంటే ఉపవాసం( Fasting ) ఆకలి హార్మోన్లను తగ్గిస్తుంది.
మరియు జీవక్రియను పెంచుతుంది.క్రమంగా మీ బరువును నియంత్రించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ పద్ధతి లో ఆహారం మరియు కేలరీల ను తీసుకోవడం ద్వారా బరువు తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.ఉపవాసం మరియు బరువు తగ్గడంలో ఇది ఎలా సహాయపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత సమాజంలో ఉపవాసం అనేది చాలా ప్రజాదరణ పొందిన పద్ధతి అని కచ్చితంగా చెప్పవచ్చు.

మీరు 16 గంటలు ఉపవాసం ఉండి ఎనిమిది గంటలు తినవచ్చు.ఉపవాసం ఉన్న 16 గంటల సమయంలో మీరు ఘనమైన ఆహారం తీసుకోవాల్సిన అవసరం లేదు.మీరు టీ, కాఫీ, లేదా నిమ్మరసం వంటి ద్రవాలను మాత్రమే తీసుకోవచ్చు.ఈ చక్రం ప్రతిరోజు లేదా వారానికి కొన్ని రోజులు చేస్తూ ఉండాలి.16 గంటల పాటు ఉపవాసం చేయడం వల్ల శరీరంలో కిటోసిన్ పెరుగుతుంది.ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది.ఇంకా చెప్పాలంటే మీరు వారంలో ఐదు రోజులు సాధారణ ఆహారాన్ని తినవచ్చు.మిగిలిన రెండు రోజులు ఉపవాసం ఉండవలసి ఉంటుంది.ఐదు రోజులు మీరు మీకు నచ్చిన ఆహారాన్ని తిని రెండు రోజులు మీరు కూరగాయలు, పాలు మరియు గంజి వంటి తక్కువ కెలరీలు ఉన్న ఆహారాన్ని తినవలసి ఉంటుంది.

రెండు రోజులు ఉపవాసం సమయం లో మీరు 500 నుంచి 600 కేలరీలు తినాలి.ఇందులో మీరు ఎక్కువ నీరు తీసుకోవాల్సి ఉంటుంది.ఈ పద్ధతిని వారానికి రెండు రోజులు లేదా ఒక రోజు కూడా చేయవచ్చు.ఒక రోజు భోజనం చేసి మరుసటి రోజు ఉపవాసం ఉండవచ్చు.ఉపవాసం మరియు ఉపవాసం లేని రోజులు వేరువేరు నమూనాలను కలిగి ఉంటాయి.ఇందులో ఒక రోజు ఉపవాసం ఉండి మరుసటి రోజు సాధారణ ఆహారం తీసుకుంటారు.
ఉపవాస రోజులలో 500 నుంచి 600 కేలరీల వరకు ఆహారం తీసుకోవడం మంచిది.ఉపవాసం లేని రోజులలో సాధారణ ఆహారం తీసుకోవాలి.
ఈ పద్ధతిని ఒక వారం లేదా నెలరోజులు కొనసాగించాలి.ఇది ఆకలి హార్మోన్లను( Hormones ) నియంత్రిస్తుంది.
అలాగే బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.