సూర్యాపేట జిల్లా: ఈ నెలలో జిల్లా కేంద్రంలో ఐటీ టవర్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు, ఐటి హబ్ గా పాత కలెక్టరేట్ భవనం అవతరించనున్నట్లు తెలుస్తుంది.దీనికి సంబంధించి గురువారం రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అమెరికాలోని ఆయా ఐటీ కంపెనీ ప్రతినిధులు రాజ్ సంగాని,శశి దేవిరెడ్డి, సందీప్ రెడ్డి కట్టా,ఫణి పాలేటి,ప్రియా రాజ్, విజయ్ దండ్యాల,అభిషేక్ బోయినపల్లి మరియు తెలంగాణ ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ సీఈఓ విజయ్ రంగినేని,టాస్క్ కో -ఆర్డినేటర్ ప్రదీప్ లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు.
స్థానిక యువత ఎప్పుడు ఎపుడా అని ఎదురు చూస్తున్న సూర్యాపేటకు త్వరలో ఐటీ సొబగులు రానున్నాయి.పాత కలెక్టర్ కార్యాలయంలో ఐటి టవర్ ను రానున్న వారం పది రోజుల్లో ఏర్పాటు చేసేందుకు మంత్రి జగదీష్ రెడ్డి నేతృత్వంలోని అధికార యంత్రాంగం నిర్ణయించింది.
రెండు రాష్ట్రాలకు వారధిగా ఉన్న సూర్యాపేటలో త్వరలో ఐటీ టవర్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రంగానికి మంత్రి జగదీశ్ రెడ్డి ఆదేశించారు.