టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై మరి కాసేపటిలో విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించనుంది.చంద్రబాబును ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ ఆయనను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు.ఈ కస్టడీ పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం మరికాసేపటిలో తీర్పును వెలువరించనుంది.
ఏసీబీ కోర్టు కస్టడీపై ఏ నిర్ణయం తీసుకోనుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.