బిగ్ బాస్( Big Boss ).తెలుగులో ప్రస్తుతం ఏడవ సీజన్ ని అట్టహాసంగా జరుపుకుంటుంది.
ఇది బుల్లితెర పైనే కాకుండా ఓటిటి( OTT ) లో కూడా ఒక సీజన్ ని పూర్తి చేసుకుంది.అయితే ఇప్పటివరకు జరిగే అన్ని సీజన్స్ లో ఎంతో మంది పాల్గొని తమ సత్తాను చాటారు కొంత మంది.
మరికొంత మంది అవకాశం రాకముందే ఇంటికి వెళ్లిపోయారు.ఏది ఏమైనా ప్రతి సీజన్ చాలా మందికి పాఠాలను మరియు గుణపాఠాలను కూడా నేర్పిస్తుంది.
ఇప్పటివరకు ఏ సీజన్లో జరగని ఒక విషయం ఇప్పుడు ఏడవ సీజన్లో జరుగుతుంది.అదేంటంటే ఒక ఇంటి సభ్యుడు చూసి మిగతా ఇంటి సభ్యులు భయపడటం.
అదేంటి తప్పుగా ఉన్న క్యాండిడేట్ నీ చూస్తే మిగతా వాళ్ళు ఎవరైనా భయపడతారు కదా అని మనం సాధారణంగా తీసుకోవచ్చు.

కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి గురించి సాధారణంగా భయపడటం కాదు అతడు గెలవకపోయినా లేదా ఏ పోటీలోనైనా ముందంజలో ఉండి తనకు సరైన గుర్తింపు దక్కకపోయినా కూడా ఒక సైకోల మారిపోతాడేమో అనే భయం అందరిలో కలుగుతుంది.ఆ ఇంటి సభ్యుడు మరెవరో కాదు ప్రిన్స్ యావర్.యావర్ రెండో వారంలోనే తనలోని ఒక భిన్నమైన కోణాన్ని ప్రేక్షకులకు రుచి చూపించాడు.
ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉన్న ఆ ప్రిన్స్ కి బుర్ర మాత్రం పని చేస్తున్నట్టుగా కనిపించడం లేదు.ఫుల్ రాజా ఫుల్ గేమ్( Full Raja Full Game ) తర్వాత యావర్ లో ఒక రకమైన సైకో కనిపిస్తున్నాడు.
తను బాగా ఆడాడని తనకు సరైన గుర్తింపు రాలేదని తనకు పవర్ అష్ర దక్కలేదని గౌతమ్ పై విరుచుకుపడ్డాడు వ్యంగ్యంగా అరుస్తూ మిగతా వారికి చిరాకు తెప్పించాడు.

ఇక అప్పుడు ఏదో గడిచిపోయిందిలే అనుకుంటే మళ్ళీ మూడవ పోటీకి శోభా, అమర్, యావర్( Shobha, Amar, Yavar ) లని పోటీదారులుగా బిగ్ బాస్ ఎంచుకోవడంతో అసలు రచ్చ మొదలైంది.ప్రిన్స్ ని అర్హుడు కాదంటూ కొంతమంది ఇంటి సభ్యులు చెప్పడంతో అతడు ఒక రకమైన హావభావాలు చూపిస్తూ పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు.ఇలాగే కంటిన్యూ అయితే యావర్ ని భరించలేమని ఇంటి సభ్యులంతా ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చారు.
కేవలం పోటీదారుడుగా ఉంటేనే ఇలా ప్రవర్తిస్తున్నాడు ఒకవేళ ఇంటి సభ్యుడు అయితే మాత్రం మనం తట్టుకోలేం అనే నిర్ణయాన్ని కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది.







