స్టార్ డైరెక్టర్ అనే పదానికి అడుగు దూరం లో ఉన్న మారుతి...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లలో మారుతి( Director Maruthi ) ఒకరు.ఈయన సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీకి వచ్చి మొదట సినిమాలకి ప్రొడ్యూసర్ గా చేసి డబ్బులు పోగొట్టుకున్నారు.

 Director Maruthi Movies Hits And Flops,director Maruthi ,director Maruthi Movies-TeluguStop.com

ఇక దాంతో ఇండస్ట్రీ నుండి వెళ్లిపోవడం ఇష్టం లేక ఇక్కడే ఉండాలి అనే ఉదేశ్యం తో డైరెక్టర్ గా మారి ఈ రోజుల్లో అనే సినిమా తీశారు.ఈ సినిమా అప్పట్లో యూత్ ని బాగా ఆకర్షించింది దానివల్లే ఈ సినిమా మంచి విజయాన్నిఅందుకుంది.

ఇక ఈ సినిమా తర్వాత బస్టాప్ అనే సినిమా చేసాడు ఈ సినిమా కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది.

 Director Maruthi Movies Hits And Flops,Director Maruthi ,Director Maruthi Movies-TeluguStop.com
Telugu Bhalebhale, Maruthi, Prabhas Maruthi, Sharwanand, Tollywood-Movie

ఇక మొదట్లో ఈయనకి బూతు సినిమాల డైరెక్టర్ అనే పేరు ఉన్నప్పటికీ ఆ తర్వాత నాని తో చేసిన బలే బలే మగాడివోయ్( Bhale Bhale Magadivoy ) సినిమాతో బూతు సినిమాల డైరెక్టర్ అనే మార్కు చెరుపేసి మంచి సినిమాల డైరెక్టర్ అనే పేరు తెచ్చుకున్నాడు.ఇక ఆయన అలాగే వరుసగా వెంకటేష్ తో బాబు బంగారం, శర్వానంద్( Sharwanand ) తో మహానుభావుడు, సాయి ధరమ్ తేజ్ తో ప్రతి రోజు పండగే లాంటి సినిమాలు చేసి మంచి విజయాలు అందుకున్నారు.ఇక ప్రస్తుతం ప్రబాస్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది.

అయినప్పటికీ ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అయితే ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు గా తెలుస్తుంది.ఈ సినిమాతో ఆయన మంచి హిట్ కూడా కొట్టబోతున్నట్టు గా తెలుస్తుంది.

ఈ సినిమా హిట్ కొడితే మారుతీ పాన్ ఇండియా డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందుతాడు.

Telugu Bhalebhale, Maruthi, Prabhas Maruthi, Sharwanand, Tollywood-Movie

నిజానికి ప్రభాస్ మారుతీ( Prabhas-Maruthi ) కి అవకాశం ఇవ్వాల్సిన పనిలేదు కానీ,యువి క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ ఇద్దరు కూడా మారుతీ కి మంచి ఫ్రెండ్స్ కావడం తో వాళ్లే మారుతీ, ప్రభాస్ కాంబో ని సెట్ చేసి ప్రభాస్ తో ఈ సినిమా చేయిస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే.ప్రస్తుతం మారుతీ ఈ సినిమా మీదనే భారీ ఆశలు పెట్టుకున్నట్టు గా తెలుస్తుంది ఇక ఈ సినిమా మారుతికి చాలా కీలకమనే చెప్పాలి… ఈ సినిమాతో సక్సెస్ కొడితే ఇండస్ట్రీ లో ఇక మారుతీ కి తిరుగు ఉండదు ఆయన కూడా స్టార్ డైరెక్టర్ల లిస్టు లో చేరిపోతాడు.అలాగే పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోతాడు.

అందుకోసమే మారుతి ఈ సినిమా మీద ఎక్కువ కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది… ఈ సినిమా సక్సెస్ అవుతుందో లేదో చూడాలంటే ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube