ఏపీలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో అసెంబ్లీ సెషన్స్ కు హాజరుకావాలని టీడీపీ శాసనసభా పక్షం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇవాళ నిర్వహించిన టీడీపీఎల్పీ సమావేశంలో పాల్గొన్న ఆ పార్టీ నేత లోకేశ్ మాట్లాడుతూ ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా భరిద్దామని చెప్పారు.చంద్రబాబు అరెస్టుతో పాటు ప్రజా సమస్యలపై అసెంబ్లీ వేదికగా గళమెత్తాలని పిలుపునిచ్చారు.
ఈ మేరకు అసెంబ్లీలో చేయాల్సిన పోరాటం అసెంబ్లీలోనే చేద్దామని చెప్పారు.అదేవిధంగా వీధుల్లో చేయాల్సిన పోరాటం వీధుల్లోనే చేద్దామని లోకేశ్ తెలిపారు.
ఒకవేళ సభలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వకుంటే బయట నిరసన తెలిపాలని పేర్కొన్నారు.ప్రజల్లోకి పార్టీ వాదనను బలంగా తీసుకెళ్లాలని వెల్లడించారు.







