తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది.అధికారంలోకి రావడమే లక్ష్యంగా హస్తం పార్టీ నేతలు ఇప్పటికే తీవ్ర కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే తాజాగా అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది.ఇందులో భాగంగా ఇవాళ, రేపు ఢిల్లీలో తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుంది.
ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై తుది నిర్ణయం తీసుకోనుంది.అభ్యర్థుల బలాబలాలు, రాజకీయ పరిస్థితుల ఆధారంగా ఎంపిక చేయనుందని తెలుస్తోంది.
మరోవైపు తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించిన కాంగ్రెస్ గ్యారెంటీ కార్డ్స్ లో భాగంగా ఆరు హామీలను ప్రకటించిన సంగతి తెలిసిందే.