తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది.
ఈ క్రమంలో ఉచిత, నిర్బంధ మరియు విద్యా హక్కు నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం పాటించడం లేదని పిటిషనర్ వాదనలు వినిపించారు.
ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీ బాలికలు, బాలురు జీవించే హక్కును కలిగి ఉన్నారని న్యాయస్థానానికి తెలిపారు.నాణ్యమైన ఆహార సదుపాయం లేకపోవడంతో రెసిడెన్షియల్ పాఠశాల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ నేపథ్యంలో సమగ్ర నివేదికను సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 6వ తేదీకి వాయిదా వేసింది.







