దశాబ్ధాలుగా మిత్రదేశాలుగా కొనసాగుతున్న భారత్-కెనడాల మధ్య ఖలిస్తాన్ ఉద్యమం( Khalistan ) చిచ్చు పెట్టింది.ఈ ఏడాది జూన్‌లో హత్యకు గురైన ఖలిస్తాన్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్యలో భారత ప్రమేయం వుందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Justin Trudeau ) చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కలకలం రేపాయి.
అటు భారత్ సైతం దీనిని తీవ్రంగా పరిగణించింది.ట్రూడో వ్యాఖ్యలను ఖండించడంతో పాటు భారత్‌లోని సీనియర్ కెనడియన్ దౌత్యవేత్తను బహిష్కరిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది.
ఆయన ఐదు రోజుల్లోగా భారత్‌ను విడిచి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో కెనడా, భారత్‌ల మధ్య సంబంధాలు ఎలాంటి టర్న్ తీసుకుంటాయోనని అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా భారత్, కెనడా మధ్య వాణిజ్య చర్చలు దెబ్బతిన్నాయి.భారత్‌తో ప్రతిపాదిత ఒప్పందంపై చర్చలను కెనడా ( Canada ) ఈ నెల ప్రారంభంలోనే నిలిపివేసినట్లు ప్రకటించింది.పరిశ్రమ అంచనాల ప్రకారం ఇరుదేశాల మధ్య సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) 2035 నాటికి కెనడాకు 6.5 బిలియన్ డాలర్ల లాభాన్ని తెచ్చిపెడుతుందని పేర్కొంది.స్థిరమైన వృద్ధితో 2022లో వస్తువుల వ్యాపారం 8 బిలియన్ డాలర్లకు పెరగగా.కెనడాకు భారతీయ ఎగుమతులు( India Exports ) 4 బిలియన్ డాలర్లకు చేరాయి, అటు కెనడా నుంచి మనదేశానికి దిగుమతులు 4 బిలియన్ డాలర్లకు చేరాయి.

కాయ ధాన్యాల దిగుమతుల కారణంగా కెనడియన్ రైతులకు( Canada Farmers ) ప్రయోజనం చేకూరుతోంది.ఇదే సమయంలో భారతీయ ఔషధ, సాఫ్ట్‌వేర్ కంపెనీలు కెనడియన్ మార్కెట్‌లో తమ ఉనికిని విస్తరించాయి.కెనడా నుంచి ప్రధాన దిగుమతులలో ఎరువులతో పాటు బొగ్గు, కోక్, బ్రికెట్లు, ఇంధన ఉత్పత్తులు వున్నాయి.భారత్ నుంచి వినియోగ వస్తువులు, వస్త్రాలు, ఆటో విడిభాగాలు, విమాన పరికరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటి ఇంజనీరింగ్ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది.

కెనడా.భారతదేశానికి( India ) 17వ అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారుగా వుంది.2000వ సంవత్సరం నుంచి 3.6 బిలియన్ల ఆదాయాన్ని అందించింది.కెనడియన్ పోర్ట్‌పోలియో పెట్టుబడిదారులు భారతీయ స్టాక్ మార్కెట్, డెట్ మార్కెట్‌లలో బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేశారు.కెనడియన్ పెన్షన్ ఫండ్ (సీపీపీ).మార్చి 2023 నాటికి భారత్‌లోని రియల్ ఎస్టేట్, పునరుత్పాదక వస్తువులు, ఆర్ధిక రంగాల్లో తన పెట్టుబడిని దాదాపు 15 బిలియన్ డాలర్లకు పెంచింది.
బొంబార్డియర్, ఎస్ఎన్‌సీ లావలిన్‌తో సహా 600కు పైగా కెనడియన్ కంపెనీలు( Canada Companies ) భారత్‌లో బలమైన ఉనికిని కలిగి వున్నాయి.
భారతీయ టెక్ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి 30కి పైగా కంపెనీలు కెనడాలో బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టి , వేలాది ఉద్యోగాలను అందిస్తున్నాయి.







