హీరో సుశాంత్ తల్లి పై పోలీస్ కేసు.. నాలుగేళ్లుగా గొడవలు?

అక్కినేని హీరో నాగార్జున సోదరీ నాగ సుశీల( Naga Sushila ) పై తాజాగా పోలీస్ కేసు నమోదు అయిందట.ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

 Police Case Nagarjuna Sister Naga Susheela, Police Case, Nagarjuna Sister,naga S-TeluguStop.com

ఈ విషయం గురించి అనేక రకాల వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి.అయితే నాగ సుశీల కొడుకు సుశాంత్ ని హీరోగా పెట్టి పలు సినిమాలను నిర్మించిన విషయం తెలిసిందే.

ఇంతకీ ఆమెపై ఎవరు కేసు పెట్టారు ఎందుకోసం పెట్టారు అసలు ఏం జరిగింది అన్న వివరాల్లోకి వెళితే.నాగార్జున చెల్లెలు నాగసుశీల కొడుకే నటుడు సుశాంత్( Actor Sushanth ).గతంలో తెలుగులో పలు సినిమాల్లో హీరోగా చేశాడు.

కొన్నాళ్ల నుంచి మాత్రం అల వైకుంఠపురములో, రావణాసుర, భోళా శంకర్ తదితర చిత్రాల్లో కీలకపాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.ఇక గతంలో సుశాంత్ ని హీరోగా పెట్టి తల్లి నాగసుశీల కరెంట్, అడ్డా, ఆటాడుకుందాం రా తదితర చిత్రాల్ని నిర్మించారు.ఈమె చింతలపూడి శ్రీనివాసరావు( Chintalapudi Srinivasa Rao ) అనే వ్యక్తితో కలిసి సినిమాలు నిర్మించారు.

అలాంటిది 2019లో నాగసుశీలనే అతడిపై పోలీస్ కేసు పెట్టారు.అప్పట్లో వీళ్లిద్దరూ కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేశారు.

తనకు తెలియకుండా శ్రీనివాసరవు భూముల్ని అమ్మేసుకుని, ఆ డబ్బు దుర్వినియోగం చేశాడని ఈమె ఆరోపణలు చేశారు.

అలాంటిది ఇప్పుడు అదే శ్రీనివాసరావు నాగసుశీలపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్‪‌లో ( Moinabad Police Station )కేసు పెట్టాడు.ఈమెతోపాటు మరో 12మంది కలిసి తనపై దాడి చేశారని అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.గత నాలుగేళ్లుగా వీళ్లిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు అదికాస్త మరోసారి కేసుల వరకు వెళ్లడంతో అది కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా అయిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube