ప్రస్తుతం వార్తల్లో ఎక్కడ చూసినా మహిళా రిజర్వేషన్ బిల్లు ( Womens Reservation Bill ) గురించి వినిపిస్తున్నాయి.దాదాపు 25 సంవత్సరాల నుంచి పెండింగ్ పడుతూ వస్తున్నటువంటి మహిళ రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
మోడీ (Modi) అధ్యక్షతన సమావేశంలో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది.అయితే ఈ బిల్లును మంగళవారం రోజు సెప్టెంబర్ 19, 2023 రోజున పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ ఈ బిల్లు ప్రవేశ పెడితే మాత్రం మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ దేశవ్యాప్తంగా లభిస్తుంది.అయితే ఈ బిల్లు ఆమోదం కోసం 25 సంవత్సరాలకు పైగా వెయిట్ చేస్తున్నారు.

అయితే మహిళా రిజర్వేషన్ బిల్లును 1996లో అప్పటి హెచ్డి దేవి గౌడ ( Deva Gouda ) సారథ్యంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఆ తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్,వాజ్ పేయి ప్రభుత్వాల్లో కూడా ఆమోద ముద్ర పడలేదు.చివరికి 2010 లో ఆమోదం పొందినా గొడవల వల్ల ఆగిపోయింది.అలాగే 2014 లోక్ సభ రద్దు కావడంతో ఈ బిల్లు పూర్తిగా పక్కన పడేశారు.కాంగ్రెస్ హయాంలో ఈ బిల్లు పూర్తిగా ఆమోదం పొందకపోవడంతో బిజెపి ఈ బిల్లును ఎలాగైనా ఆమోదించాలని కంకణం కట్టుకుంది.
కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్న తరుణంలో ఈ బిల్లును ఎలాగైనా ప్రవేశపెట్టాలని అనుకుంటున్నారు.ఒకవేళ ఈ బిల్లు పొందితే మాత్రం తప్పనిసరిగా బిజెపి గ్రాఫ్ పెరిగి కాంగ్రెస్ గ్రాఫ్ కిందికి పడిపోయే అవకాశం ఉంది.
ఎందుకంటే గత కొన్ని పర్యాయాలు కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Governament ) లో ఆమోదం పొందకుండా కాలయాపన చేసుకుంటూ వచ్చారు.

కాబట్టి దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన బిజెపి బిల్లును ప్రవేశపెడితే మహిళా లోకానికి ఎంతో మేలు చేసిన ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోతుంది.ఈ బిల్లు ఎలాగైనా పాస్ అవుతుందని తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బిల్లుకు సపోర్ట్ చేస్తున్నట్టు మీడియా ముందు చెప్పుకుంటుంది.ఇలా బీజేపీ పన్నిన వ్యూహంలో కాంగ్రెస్ విలవిలా కొట్టుకుంటోంది.
కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఎన్ని ప్లాన్ లు వేసినా కూడా బిజెపి ( BJP ) ముందు అవన్నీ బెడిసి కొడుతున్నాయి.







