తెలంగాణ రాష్ట్రంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు.తెలంగాణపై ప్రధాని విషం చిమ్మారన్న ఆయన రాష్ట్రంపై మోదీ అర్ధరహితంగా మాట్లాడారని తెలిపారు.
బీజేపీ చేసిన అన్యాయాలు, అక్రమాలు అన్ని ఇన్ని కావని గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు.ఏపీ పాలకుల ఒత్తిళ్లకు లొంగి 69లో తెలంగాణ ఇవ్వలేదని చెప్పారు.
మత విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ పని అని ఆరోపించారు.ప్రజల ఒత్తిడి మేరకు తెలంగాణ ఏర్పాటు అయిందన్నారు.
కేసీఆర్ పోరాటంతోనే కేంద్రం దిగొచ్చిందని తెలిపారు.కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టేలా హామీలు ఇస్తుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఆచరణలో సాధ్యం కావన్న గుత్తా కాంగ్రెస్, బీజేపీ కల్లబొల్లి మాటలు నమ్మొద్దని సూచించారు.







