రాష్ట్ర రాజకీయాల్లో తన ప్రకటనతో ఒక్కసారిగా గేర్ మార్చిన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఆ ప్రకంపనల తాలూకు రియాక్షన్ ను తన మంగళగిరి సభ స్పీచ్ ద్వారా నార్మల్ చేసేసారు.పొత్తు ఒక చారిత్రక అవసరమని, రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకున్నప్పటికీ అది ఒక పార్టీగా జనసేన ఎదుగుదలకు ఏ రకమైన అడ్డంకి ఉండదని, 10 సంవత్సరాల పాటు కఠిన మయిన రాజకీయ ప్రయాణం చేసి పార్టీని నిలబెట్టిన తనపై నమ్మకం ఉంచాలని పార్టీ విస్తృత స్తాయి సమావేశంలో పవన్ జనసైనికులను కోరారు .
పవన్ ఇచ్చిన వివరణతో మెజారిటీ జనసైనికులు సంతృప్తి చెందినట్లుగా పరిణామాలు కనిపిస్తున్నాయి .ఇప్పుడు ఆ వేడిలోనే ఇరుపక్షాల జాయింట్ యాక్షన్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని రెండు పార్టీల నేతలు తొందర పడుతున్నట్లుగా తెలుస్తుంది.ఈ దిశగాజైలు లో ఉన్న ప్రతిపక్ష నేత చంద్రబాబును( Chandrababu naidu ) ఆ పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు కలిసి చర్చించినట్లుగా తెలుస్తుంది .

ఇప్పటికే జాయింట్ యాక్షన్ కమిటీకి జనసేన తరఫున నాదెండ్ల మనోహర్ నాయకత్వం వహిస్తారని పవన్ ప్రకటించారు.మిగతా సభ్యుల వివరాలను కూడా ఈ వారంలో ప్రకటించనునట్లుగా తెలుస్తుంది.మరోవైపు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా యనమల రామకృష్ణుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు( Kinjarapu Atchannaidu ), చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి లాంటి హేమాహేమీలు ఈ కమిటీ లో సభ్యులుగా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది.

ఎన్నికలు వచ్చే వరకూ అనుసరించాల్సిన ఎన్నికల సరళిని, ప్రచార కార్యక్రమాలను, పొత్తు చర్చలను , టికెట్ల కేటాయింపులకు సంబంధించిన సర్దుబాట్లను ఈ కమిటీ చూడబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.మరో వైపు కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సంచలన నిర్ణయాలు తీసుకునే దిశగా ముందుకు వెళుతుండడంతో ఎన్నికలు ఏప్పుడైనా రావచ్చన్న అభిప్రాయం దేశవ్యాప్తంగా నెలకొంది .దాంతో తమ వేగాన్ని పెంచాలని , శరవేగం గా నిర్ణయాలు తీసుకోవాలని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెండు పార్టీల ఉమ్మడిగా ఎదుర్కునే విదం గా సిద్ధం చేయాలని ఇరు పార్టీల అధినేతలు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది
.






