కోలీవుడ్ హీరో ధనుష్ ( Dhanush ) రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య ని పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే వీరి పెళ్లి జరిగి దాదాపు 18 సంవత్సరాల తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో కొడుకుల భవిష్యత్తు కూడా ఆలోచించకుండా ఇద్దరు విడాకులు తీసుకున్నారు.
ప్రస్తుతం వీరిద్దరూ విడివిడిగానే ఉంటున్నారు.ఇక వీరి విడాకుల విషయంలో రజనీకాంత్( Rajinikanth ) , కస్తూరి రాజా ఇద్దరు కలగజేసుకొని ఎన్నిసార్లు కలుపుదామని చూసిన కూడా వీరిద్దరూ భార్యాభర్తలు గా కలిసి ఉండడానికి ఒప్పుకోలేదు.
ఇక కూతురు భవిష్యత్తు అలా అవ్వడంతో రజనీకాంత్ చాలా బాధపడ్డారు.ఇదంతా పక్కన పెడితే ఐశ్వర్య వల్ల ధనుష్ తాను ప్రేమించిన అమ్మాయికి దూరం అవ్వాల్సి వచ్చిందట.
ఇక అసలు విషయం ఏమిటంటే.ధనుష్ అన్న సెల్వ రాఘవన్ ( Selva raghavan ) భార్య సోనీయా అగర్వాల్ ని ముందుగా ధనుష్ ప్రేమించారట.ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన కాదల్ కొండెన్ అనే సినిమా సమయంలో వీరి మధ్య లవ్ పుట్టిందట.ఇక ఆ సమయంలోనే వీరిద్దరూ చాలా రోజులు లవ్ ట్రాక్ నడిపించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నారట.
కానీ అదే సమయంలో ధనుష్ తండ్రి కస్తూరి రాజా ( Kasthuri Raja ) కు రజనీకాంత్ నా కూతురు ఐశ్వర్య ని మీ కొడుకు ధనుష్ కి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నాను అని చెప్పారట.ఇక కస్తూరి రాజా కూడా పెద్దింటి సంబంధం అని ఒకే చెప్పారట.
కానీ ధనుష్ ఇష్టం మాత్రం పట్టించుకోలేదట.ఇక తన తండ్రి ఆల్రెడీ మాట ఇవ్వడంతో సోనియా అగర్వాల్ ( Sonia Agarwal ) కి పెళ్లి చేసుకోలేను అని ధనుష్ చెప్పారట.
ఇక ఆ మాట చెప్పడంతో సోనియా చాలా రోజులు ఏడ్చి డిప్రెషన్ లోకి వెళ్లిందట.
ఇక అదే సమయంలో ధనుష్ అన్న సెల్వ రాఘవన్ 7/G బృందావన్ కాలనీ ( 7/G Brindavan colony ) సినిమా స్టోరీ చెప్పి ఆమెనే హీరోయిన్ గా పెట్టుకున్నారు.ఇక లవ్ ఫెయిల్యూర్ బాధలో ఉన్న సోనియా అగర్వాల్ ని ఆ సినిమా షూటింగ్ సమయంలో సెల్వ రాఘవన్ ఓదార్చుతూ ఆమెకు దగ్గరయ్యారు.అలా వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి చేసుకున్నప్పటికీ వీరి మధ్య బంధం ఎక్కువ రోజులు నిల్వలేకపోయింది.
అలా వీరిద్దరు కూడా విడాకులు తీసుకున్నారు.