కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు విపరీతంగా ఆదరించే బుల్లితెర రియాలిటీ షోస్ లో ఒకటి బిగ్ బాస్.( Bigg Boss ) ఒక్క సీజన్ తో ప్రారంభమైన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఆరు సీజన్స్ ని పూర్తి చేసుకొని ఇప్పుడు 7 వ సీజన్ లోకి( Bigg Boss 7 ) అడుగుపెట్టింది.
ఆరవ సీజన్ కి పెద్దగా టీఆర్ఫీ రేటింగ్స్ రాలేదు కానీ, 7 వ సీజన్ కి మాత్రం మొదటి రోజు నుండే ఆల్ టైం రికార్డు రేటింగ్స్ తో ప్రారంభం అయ్యింది.మునుపెన్నడూ లేని విధంగా ‘ఉల్టా పల్టా’ అంటూ సరికొత్త కాన్సెప్ట్ తో ప్రారంభమైన ఈ సీజన్ కి అశేష ప్రేక్షాధారణ వస్తుంది.
ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ సరికొత్త సీజన్, మొదటి వారం లో కిరణ్ ఎలిమినేట్ అవ్వగా, రెండవ వారం షకీలా ( Shakeela ) ఎలిమినేట్ అయ్యింది.ఈమె ఎలిమినేషన్ ఇంట్లో ఉన్న వాళ్లందరికీ బాధని కలిగించింది.
ఎందుకంటే ఈమె ఇంట్లో ఉన్నన్ని రోజులు ఒక అమ్మలాగా అందరిని ఆదరించింది, గొడవలు వస్తే సర్దిచెప్పింది, అందరిని కలిపే ప్రయత్నం చేసింది.టాస్కులు కూడా తన వయస్సు, శక్తికి తగ్గట్టుగా పర్వాలేదు అనే రేంజ్ లో ఆడింది.కానీ మిగిలిన కంటెస్టెంట్స్ తో పోలిస్తే ఆమెకి ప్రేక్షాదరణ తక్కువగా ఉండడం వల్లే ఎలిమినేట్ అయ్యిందని అందరూ అంటున్నారు.ఇదంతా పక్కన పెడితే ఈమె ఇంట్లో ఉన్నన్ని రోజులు స్మోకింగ్ జోన్ లోనే ఎక్కువగా కూర్చునేది.
ఈమెని చూసే ప్రేక్షకులందరూ ఈమె ఏంటి బాబోయ్ ఇన్ని సిగరెట్స్ ( Cigarettes ) తాగుతుంది అని తిట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు.నార్త్ ఇండియన్స్ కి ఇది సర్వసాధారణం, కానీ మన తెలుగు ఆడియన్స్ మాత్రం ఇలాంటివి తీసుకోలేరు అనే విషయం అందరికీ తెలిసిందే.14 రోజులు ఆమె ఇంట్లో ఉంటే 280 సిగరెట్స్ కాల్చింది అట.
అంటే రోజుకి 20 సిగరెట్స్ త్రాగింది అన్నమాట.అంత పెద్ద వయస్సులో ఉన్న ఆమె ఇన్ని సిగరెట్స్ కాలిస్తే ఆరోగ్యం ఏమవుతుంది, సిగరెట్స్ కాల్చడానికి ఆమెకి శక్తి ఉంది కానీ, టాస్కులు ఆడడం లో మాత్రం లేదా అని అంటున్నారు నెటిజెన్స్.బిగ్ బాస్ ని ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తూ ఉంటారు.
షకీలా మొదటి నుండి బీ గ్రేడ్ సినిమాలు చేస్తుంది అనే పేరు ఫ్యామిలీ ఆడియన్స్ లో కచ్చితంగా ఉంటుంది .ఇప్పుడు ఈ సిగరెట్ కాల్చడాలు వంటివి చెయ్యడం తో ఆమెపై ఇప్పుడు మరింత నెగటివిటీ ఏర్పడింది.