సామాన్యులకే కాకుండా సినిమా సెలబ్రెటీలకు కూడా చాలా సెంటిమెంట్లు ఉంటాయి.ఉదాహరణకి త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) “అ” అక్షరంతో మొదలయ్యే సినిమాలను తీస్తేనే అవి హిట్ అవుతాయని ఒక సెంటిమెంట్ పెట్టుకున్నాడు.
నాగార్జున( Nagarjuna ) తన సినిమా డిసెంబర్ నెలలో రిలీజ్ అయితేనే హిట్ అవుతుందని అనుకుంటాడు.సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన సినిమా ముహుర్తానికి రాకూడదనే ఒక సెంటిమెంట్ పెట్టుకున్నాడు.
బాలకృష్ణ సంక్రాంతి సందర్భంగా సినిమా రిలీజ్ అయితేనే సినిమా హిట్ అవుతుందని నమ్ముతాడు.ఇలా మూవీ ఇండస్ట్రీలో హీరోలకు, డైరెక్టర్లకు ఒక్కో సెంటిమెంటు ఉంటూ వస్తోంది.
అయితే మన తెలుగు వారికి మాత్రమే ఈ సెంటిమెంట్స్ పరిమితం కాలేదు. కోలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఈ తరహా సెంటిమెంట్స్ నమ్మేవారు ఉన్నారు

వారిలో ప్రముఖ డైరెక్టర్ అట్లీ కుమార్( Atlee Kumar ) ఒకరు.ఈ డైరెక్టర్ తన సినిమాలో సెకండ్ హీరోయిన్ ని చంపేస్తే గానీ తనకు హిట్ రాదని నమ్ముతున్నట్లు తెలుస్తోంది.కథపరంగా అతడు హీరోయిన్ చనిపోయేటట్లు రాసుకుంటాడని ఇప్పటివరకు అతను తీసిన సినిమాలు చూస్తుంటే స్పష్టమవుతోంది.
ఉదాహరణకి అతను తీసిన తొలి సినిమా “రాజారాణి”లో సెకండ్ హీరోయిన్‌గా చేసిన నజ్రియా నజీమ్ రోల్ చనిపోతుంది.ఆ తర్వాత తీసిన “తేరి” మూవీలో కూడా సెకండ్ హీరోయిన్ గా కనిపించిన సమంత పాత్ర కన్నుమూస్తుంది.

అనంతరం అట్లీ డైరెక్ట్ చేసిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘మెర్సల్ (2017)’ లో హీరోయిన్ నిత్యామీనన్ క్యారెక్టర్ కూడా మరణిస్తుంది.ఇటీవల బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ జవాన్ (2023)లో కూడా సెకండ్ హీరోయిన్ గా కనిపించిన దీపికా పదుకొనే( Deepika Padukone ) క్యారెక్టర్ చనిపోతుంది.ఇందులో దీపిక చిన్నపాటి రోల్ మాత్రమే చేసింది.కానీ ఆమెను సెకండ్ హీరోయిన్ గా పరిగణించారు.ఇలా సెకండ్ హీరోయిన్ పాత్ర చనిపోయిన ప్రతీ అట్లీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.దీన్నిబట్టి చూస్తుంటే ఈ హీరో తన సినిమాలో సెకండ్ హీరోయిన్ చనిపోతేనే అది హిట్ అవుతుందనే సెంటిమెంట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
మరి నెక్స్ట్ సినిమాలో కూడా ఇదే సెంటిమెంట్ అతను ఫాలో అవుతాడా? ఆ సినిమా కూడా హిట్ అవుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.కాగా అతడు గతంలో హిట్ అయిన కొన్ని సినిమాలు కొంచెం మోడర్న్ గా మార్చేసి రిలీజ్ చేస్తున్నాడని విమర్శలు ఉన్నాయి.







