మూడు లోకాలు తిరిగి రాబోతున్న మెగాస్టార్ చిరంజీవి..కొత్త సినిమా స్టోరీ మామూలు రేంజ్ లో లేదు!

ఈ ఏడాది మెగా ఫ్యాన్స్ కి విపరీతమైన ఆనందం , అలాగే పట్టరాని కోపం రప్పించాడు మెగాస్టార్ చిరంజీ( Chiranjeevi )వి.ఏడాది ప్రారంభం లో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ ని షేక్ చేసి 140 కోట్ల రూపాయిలను కొల్లగొట్టిన మెగాస్టార్ చిరంజీవి, ఆగష్టు నెలలో ‘భోళా శంకర్’ సినిమాతో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ ని అందుకొని మెగా ఫ్యాన్స్ కి ఫ్రస్ట్రేషన్ వచ్చేలా చేసాడు.

 Megastar Chiranjeevi Who Is Going To Return To Three Worlds The Story Of The New-TeluguStop.com

ఈ సినిమాకి ఫుల్ రన్ లో కనీసం 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా రాలేదు అంటే ఎంతటి ఘోరమైన డిజాస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు.మెగాస్టార్ గత చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ సినిమా మొదటి రోజు వసూళ్లు, ‘భోళా శంకర్’ క్లోసింగ్ కలెక్షన్స్ కంటే ఎక్కువ.

అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఇలాంటి డిజాస్టర్ ఫ్లాప్ రావడం అనేది అత్యంత శోచనీయం.

Telugu Bhola Shankar, Chiranjeevi, Vasishta, Godfather, Mrunal Thakur, Tollywood

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కి మళ్ళీ భారీ బ్లాక్ బస్టర్ హిట్ రావాలి.అది ‘వాల్తేరు వీరయ్య‘ కి మించి వసూళ్లను రాబట్టాలి, అప్పుడే మెగా ఫ్యాన్స్ సంతృప్తి చెందుతారు.ఆయన తదుపరి చిత్రం యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ‘భింబిసారా’ డైరెక్టర్ వసిష్ఠ( Director Vasishta ) తో చెయ్యబోతున్నాడు.

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతుంది.ఈ కథ మూడు లోకాల చుట్టూ తిరుగుతుంది అట, తన కూతురు కోసం వెతుక్కుంటూ వెళ్లే తండ్రిగా చిరంజీవి ఇందులో కనిపించబోతున్నాడు.

ఇకపోతే ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్ ఉంటారట.అందులో ఇద్దరు అనుష్క శెట్టి మరియు మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ).మిగిలిన ఇద్దరి కోసం వెతుకుతున్నారు.విభిన్నమైన కథాంశం తో తెరకెక్కుతున్న ఈ చిత్రం కచ్చితంగా మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా ఉంటుందని సమాచారం.

ఈ సినిమా హిట్ తో ‘భోళా శంకర్’ చేదు జ్ఞాపకం ని మర్చిపోతారట.

Telugu Bhola Shankar, Chiranjeevi, Vasishta, Godfather, Mrunal Thakur, Tollywood

గాడ్ ఫాదర్ చిత్రం ( Godfather )తర్వాత చిరంజీవి మళ్ళీ వయస్సుకు తగ్గ పాత్రని పోషిస్తున్నాడు.అంతే కాకుండా ఈ సినిమా రీమేక్ కాదు.‘భోళా శంకర్’ ఇచ్చిన అనుభవం తో ఇక నుండి రీమేక్ సినిమాలు చెయ్యకూడదని బలంగా నిర్ణయించుకున్నాడట.ఇది మెగా ఫ్యాన్స్ కి కాస్త ఊరట ని ఇచ్చే విషయం, ఈ సినిమా తర్వాత చిరంజీవి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో ఒక సినిమా చెయ్యబోతున్నాడు.ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

చిరంజీవి కూతురు సుస్మిత నిర్మిస్తున్న ఈ చిత్రం లో చిరంజీవి తో పాటుగా మరో హీరో కూడా ఉంటాడట, చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube