చాలా సంవత్సరాల నుంచి బాలీవుడ్( Bollywood ) అంటే ఇండియాలోనే అత్యంత పెద్ద ఇండస్ట్రీగా గుర్తింపు ఉండేది వాళ్లు సౌత్ సినిమాలని అసలు పట్టించుకునే వారే కాదు.ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే వాళ్ళకి చాలా చిన్న చూపు ఉండేది.
వాళ్ళు మన హీరోలని అసలు లెక్క చేసేవాళ్ళు కాదు తెలుగు సినిమాలు అంటే 6 పాటలు 4 ఫైట్లు 3 కుళ్ళు జోకులు అంటూ మన సినిమాలను కామెడీ సినిమాలా లాగా చూసేవారు.మన తెలుగు సినిమా లా మీద వాళ్ళు చాలా సార్లు సెటైర్లు కూడా వేయడం జరిగింది.
ఇక ఇప్పుడు రాజమౌళి బాహుబలి సినిమా( Baahubali movie ) తీసిన తర్వాత తెలుగు సినిమా అంటే ఏంటి అనేది బాలీవుడ్( Bollywood ) కి అర్థమైంది.ప్రస్తుతం ఇండియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీనే టాప్ లెవెల్ లో ఉంది.
అప్పుడు మన కథల్ని బాగాలేవు అని హేళనగా మాట్లాడారు ఇప్పుడు ఆ బాలీవుడ్ హీరోలు గానీ జనాలు కానీ తెలుగు సినిమాల గురించి ఎదురుచూస్తున్నారు.

తెలుగులో ఏదైనా మంచి కథ దొరికితే తెలుగు సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేద్దాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుగులో ఇంతకుముందు వచ్చిన పాత సినిమాలు మొత్తాన్ని వెతుకుతున్నారు.అందులో ఏదైనా మంచి సినిమా కనిపిస్తే దాన్ని చేస్తున్నారు రోజులు అన్నీ ఒకేలా ఉండవు అనడానికి ఇదే రీజన్…అప్పట్లో వాళ్లకు మన సినిమాలు నచ్చేవి కాదు కానీ ఇప్పుడు వాళ్లే మన సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు ఇక బాలీవుడ్ జనాలు కూడా అక్కడ హీరోలు తీసే సినిమాల పట్ల విసిగిపోయి సౌత్ సినిమాల పైన ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలని ఎక్కువగా ఆదరిస్తున్నారు.అందులో భాగంగానే ఆర్ ఆర్ ఆర్ కానీ, కార్తికేయ 2 సినిమా గానీ, అలాగే పుష్ప సినిమా గానీ మంచి విజయాలను అందుకున్నాయి… ప్రస్తుతం ఇండియాలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ ఇండస్ట్రి గా ఎదిగింది…
.







