వైఎస్ఆర్ అధినేత్రి వైఎస్ షర్మిల( YS Sharmila ) తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి రాజకీయంగా సత్తా చాటలని భావించారు.ప్రత్యేకపార్టీ వల్ల పెద్దగా లాభం చేకూరకపోవడంతో కాంగ్రెస్ వైపు చూస్తూ వచ్చారమే.
ఎలాగైనా తన పార్టీని కాంగ్రెస్ లో ( Congress )విలీనం చేసి క్రియాశీలక పాత్ర పోషిచాలని భావించారు.అంతే కాకుండా తాను ఆశిస్తున్న పాలేరు సీటు కూడా తనకే దక్కుతుందని భ్రమలో ఉండిపోయారు.
తాజా పరిస్థితులు చూస్తుంటే హస్తం అధిష్టానం అసలు షర్మిల సంగతే పట్టించుకోవడం లేదని టాక్ వినిపిస్తోంది.ఇప్పటికే పలు మార్లు కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ అయిన షర్మిలకు అధిష్టానం నుంచి సరైన స్పందన రాలేదట.

ఇక ఇటీవల సీడబ్ల్యూసీ సమావేశాల కారణంగా మరోసారి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ( Sonia Gandhi )తో భేటీ అవ్వాలని ప్రయత్నించిన అధిష్టానం విముఖత చూపినట్లు టాక్.దీంతో షర్మిలను చేర్చుకోవడంపై అధిష్టానం ఆసక్తికనబరచడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.కాగా ఇటీవల బిఆర్‌ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరారు.ఆయన పాలేరు సీటు కోసం బిఆర్‌ఎస్ లో ప్రయత్నించి సీటు దక్కకపోవడంతో కాంగ్రెస్ లో చేరారు.
కాంగ్రెస్ అగ్రనేతలు ఆయనకు పాలేరు సీటు కన్ఫమ్ చేసిన తరువాత తుమ్మల హస్తం పార్టీ కండువా కప్పుకున్నాట్లు టాక్.

అందువల్ల పాలేరు సీటు ఆశిస్తున్న షర్మిలను చేర్చుకుంటే మళ్ళీ అంతర్గత కుమ్ములాటలు పెరుగుతాయని రేవంత్ రెడ్డి ( Revanth Reddy )బృందం హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లిందట.అందుకే అధిష్టానం కూడా షర్మిలను చేర్చుకోవడంపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదని టాక్.దానికి తోడు మొదటి నుంచి కూడా షర్మిల టి కాంగ్రెస్ లో చేరడంపై రేవంత్ రెడ్డి ప్రతిఘటిస్తూనే ఉన్నారు.
అందువల్ల షర్మిలను కాంగ్రెస్ లో చేర్చుకుంటే రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి చెందే అవకాశం ఉంది.ఎన్నికల ముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అసహనంగా ఉండడం పార్టీకి మంచిది కాదని హైకమాండ్ భావిస్తోందట.
అందుకే షర్మిల కాంగ్రెస్ లో చేరితే ఒకేనని.టి కాంగ్రెస్ లో మాత్రం వద్దని అధిష్టానం కూడా భావిస్తుందట.
దాంతో షర్మిల పార్టీ విలీనం ఇప్పట్లో జరిగే అవకాశం లేదనే గుసగుసలు వింపిస్తున్నాయి.మొత్తానికి కాంగ్రెస్ లో చేరి సత్తా చాటలని భావించిన వైఎస్ షర్మిల ప్లాన్స్ అని వేస్టేనని కొందరి అభిప్రాయం.







