ఢిల్లీలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అయ్యాయి.పాత పార్లమెంట్ భవనంలో ఇవాళ్టి సమావేశాలు కొనసాగుతున్నాయి.
ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నారన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో జీ20 సమ్మిట్ విజయవంతంపై ఉభయసభల్లో ప్రకటన చేస్తున్నారు.
ప్రధానమంత్రి మోదీ సమర్థతతో జీ20 సమావేశాలు విజయవంతం కావడం అందరికీ గర్వకారణమని స్పీకర్ తెలిపారు.ప్రపంచ దేశాలు భారత్ ను ప్రశంసిస్తున్నాయన్న లోక్ సభ స్పీకర్ దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందని చెప్పారు.
ఈ క్రమంలోనే జీ20 సమ్మిట్ ను విజయవంతం చేసిన ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు.
మరోవైపు లోక్ సభ ప్రారంభం కాగానే విపక్ష పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో స్వల్ప గందరగోళం నెలకొంది.







