సంక్రాంతి రేస్ లో ప్రభాస్ - మారుతి మూవీ.. ట్విస్ట్ ఇదే!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Pan India Hero Prabhas ) బాహుబలి సిరీస్ తర్వాత మరో హిట్ అనేది కొట్టలేదు.అయినప్పటికీ ఈయన మార్కెట్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు.

 Is The Prabhas-maruthi Film To Be Released On Sankranthi, Prabhas, Maruthi, Raja-TeluguStop.com

పైగా రోజురోజుకూ ఈయన క్రేజ్ అమాంతం పెరిగి పోయింది.ప్రభాస్ మార్కెట్ వరల్డ్ వైడ్ గా భారీగా పెరగడంతో ఈయన చేస్తున్న సినిమాలన్నీ వరుసగా పాన్ ఇండియా సినిమాలుగానే తెరకెక్కుతున్నాయి.

ప్రజెంట్ ప్రభాస్ పలు క్రేజీ ప్రాజెక్టులు లైన్లో పెట్టగా ఆ సినిమాలన్నీ వేగంగా షూటింగ్ జరుపు కుంటున్నాయి.వీటిల్లో యంగ్ డైరెక్టర్ మారుతి( Young Director Maruthi ) దర్శకత్వంలో చేస్తున్న మూవీ ఒకటి.ఈ సినిమా ఇంకా అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్నట్టు టాక్.ఇప్పటి వరకు ఈ సినిమాకు డీలక్స్ రాజా, వింటేజ్ కింగ్, రాజా డీలక్స్ అనే పేర్లు వైరల్ అయ్యాయి.

ఇక ఇందులో ప్రభాస్ కు జోడీగా ముగ్గురు యంగ్ హీరోయిన్స్ నటిస్తున్నట్టు టాక్.అందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్( Nidhhi Agerwal ) ను ఇప్పటికే ఫైనల్ చేయగా మరో ముద్దుగుమ్మ ఇంకా ఫిక్స్ కాలేదు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఇప్పుడు వైరల్ అవుతుంది.ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చూస్తున్నారట.

త్వరలోనే అఫిషియల్ అప్డేట్ కూడా రాబోతుందని టాక్.

2024 లోనే రిలీజ్ అవుతుంది అని ప్రభాస్ ఫ్యాన్స్( Prabhas Fans ) భావిస్తుండగా ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ కావడంతో నిజంగానే 2025 వరకు ప్రభాస్ మారుతి మూవీ రిలీజ్ అవ్వదేమో అని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.కాగా ప్రస్తుతం ప్రభాస్ విదేశాల్లో ఉండడంతో మిగిలిన షూటింగ్ పూర్తి చేస్తున్నారు.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా ఫుల్ కామెడీ జోన్ లో తెరకెక్కుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube