తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి కుటుంబానికి ఎలాంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో మనకు తెలిసిందే.నందమూరి తారక రామారావు(Nandamuri Tarakaramarao ) హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇలా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయినటువంటి ఎన్టీఆర్ అనంతరం రాజకీయాలలోకి వచ్చారు రాజకీయాలలోకి వచ్చినటువంటి ఈయన తెలుగుదేశం పార్టీని(Telugu Desam Party) స్థాపించి అతి తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.

ఇక ఎన్టీఆర్ కుమారులలో హరికృష్ణకు ఎంతో మంచి ప్రాధాన్యత ఉంది ఈయన ఎన్టీఆర్ కి కుడి భుజంలా ఉండేవారు ఆయన రథసారధిగా కూడా మారిపోయారు ఇలా ప్రతి చిన్న విషయానికి హరికృష్ణ ఎన్టీఆర్ కి చేదోడు వాదోడుగా ఉండేవారు అయితే ఇలా వీరిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ అనుబంధం చూసినటువంటి ఒక స్టార్ హీరో ఇద్దరి మధ్య పెట్టినటువంటి చిచ్చు కారణంగా ఎన్టీఆర్ హరికృష్ణ(Harikrishna) మధ్య దాదాపు రెండు సంవత్సరాల పాటు మాటలు లేవని ఇలా ఈ తండ్రి కొడుకులను విడదీశారని తెలుస్తుంది.మరి వీరిద్దరి మధ్య ఇలాంటి చిచ్చుపెట్టిన ఆ హీరో ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే.

సీనియర్ ఎన్టీఆర్ కి కుడి భుజంలా ఉండే హరికృష్ణకు తన సినిమా విషయాలు గానీ రాజకీయాల విషయాలు గానీ అన్ని తెలియజేసే వారట అయితే ఒకసారి హరికృష్ణ తన కోసం తన తండ్రిని ఒక స్టూడియో కట్టించమని అడిగారట ఇలా స్టూడియో ఉంటే భవిష్యత్తులో కూడా బాగుంటుందన్న ఉద్దేశంతోనే హరికృష్ణ తన తండ్రి దగ్గరకు వెళ్లి తనకు ఒక స్టూడియో(Studio) నిర్మించి ఇవ్వాలని చెప్పారట.దీంతో ఎన్టీఆర్ కూడా సరేనని చెప్పారు అయితే ఎన్టీఆర్ కి ఎంతో ఆప్త మిత్రుడు అయినటువంటి స్టార్ హీరో అక్కినేని నాగేశ్వరరావు( Akkineni Nageswara Rao ) వద్దకు వెళ్లి హరికృష్ణ ఇలా స్టూడియో కట్టించమన్నారనే ఈ విషయం గురించి ప్రస్తావించారట.

ఈ విధంగా స్టూడియో నిర్మాణ విషయం గురించి నాగేశ్వరరావు వద్ద ప్రస్తావించగా ఆయన స్టూడియో కన్నా థియేటర్ నిర్మించడం మేలు మనకు చాలా మంచి లాభాలు వస్తాయి అని తన అభిప్రాయాన్ని ఎన్టీఆర్ కి చెప్పారట దీంతో ఎన్టీఆర్ కూడా థియేటర్ మంచిదని భావించి స్టూడియో కాకుండా థియేటర్ నిర్మాణం చేపట్టారు అయితే ఈ విషయంలో ఎన్టీఆర్ పై కోప్పడినటువంటి హరికృష్ణ నేను చెప్పిన విధంగా కాకుండా తనకు నచ్చిన విధంగా తన తండ్రి వ్యవహరిస్తున్నారన్న కోపంతో దాదాపు రెండు సంవత్సరాల పాటు తన తండ్రితో మాట్లాడలేదట ఇలా తన తండ్రిపై కోపం తగ్గిన తర్వాత తిరిగి ఎన్టీఆర్ వద్దకు హరికృష్ణ వచ్చారని తెలుస్తోంది.ఏఎన్ఆర్(ANR) కారణంగానే ఎన్టీఆర్ హరికృష్ణ మధ్య రెండు సంవత్సరాలు పాటు మాటలు లేవని చెప్పాలి.