తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ లో ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకలకు హాజరైన కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
17 సెప్టెంబర్ 1948న తెలంగాణ భారత్ లో అంతర్భాగమైందని కేసీఆర్ తెలిపారు.తెలంగాణ ఉద్యమంలో పోరాడిన యోధులకు వందనాలు చెప్పిన కేసీఆర్ 1956 వరకు హైదరాబాద్ రాష్ట్రంగా వెలుగొందిందన్నారు.
తరువాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ను కలిపారన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాలు అయినా పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలు వేధిస్తున్నాయని చెప్పారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత సకల జనులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు.తెలంగాణలో తలసరి ఆదాయం పెరిగిందని పేర్కొన్నారు.
గతంలో పాలమూరు ప్రజలకు వలసలే దిక్కయ్యేదన్న కేసీఆర్ పాలమూరు, రంగారెడ్డి జిల్లాలపై ప్రధాన దృష్టి సారించామని స్పష్టం చేశారు.ఈ క్రమంలోనే వలస వెళ్లిన వారు వాపస్ వచ్చే స్థాయికి అభివృద్ధి చేశామని తెలిపారు.