గత కొద్ది రోజులుగా వైష్ణవ్ తేజ్ కృతి శెట్టి( Krithi Shetty ) మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ నడుస్తుంది అని ఇప్పటికే ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా గత రెండు మూడు రోజుల కింద వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని, త్వరలోనే వీరి పెళ్లి జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.
అయితే ఈ వార్తలపై తాజాగా క్లారిటీ వచ్చింది.మరి కృతి శెట్టి పెళ్లి వైష్ణవ్ తేజ్ ( Vaishnav Tej ) తో జరిగేది నిజమేనా.
అసలు కృతి శెట్టి టీం ఏం చెప్పింది.అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
చిన్న వయసులోనే ఉప్పెన( Uppena ) అనే సినిమాలో హీరోయిన్ గా చేసిన కృతి శెట్టి ఆ తర్వాత వరస సినిమాలకు కమిట్మెంట్ ఇవ్వడంతో ఒక్కసారిగా అప్పుడు ఉన్న సీనియర్ హీరోయిన్ లను పక్కనపెట్టి ఈ హీరోయిన్ కి అవకాశాలు ఇచ్చారు కానీ ఎప్పుడైతే ఈ హీరోయిన్ నటించిన సినిమాలు వరుసగా ప్లాఫ్ అయ్యాయో అప్పటినుండి అవకాశాల కోసం వెతుక్కోవాల్సిన పరి.స్థితి ఏర్పడింది.
ఇక ఈ మధ్యకాలంలో అయితే అవకాశాల కోసం ఏకంగా కృతి శెట్టి( Krithi Shetty ) పొట్టి బట్టలు వేసుకుంటూ ఫోటోషూట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆఫర్స్ కోసం అష్ట కష్టాలు పడుతుంది.అయితే ఇలాంటి నేపథ్యంలోనే కృతి శెట్టి పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఓ వార్త వినిపించడంతో ఈ వార్తపై క్లారిటీ ఇచ్చారు కృతి శెట్టి టీమ్.వాళ్ళు మాట్లాడుతూ.అసలు కృతి శెట్టి వైష్ణవ్ తేజ్ ( Vaishnav tej ) పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.కావాలనే కొంతమంది లేనిపోని వార్తలను ప్రచారం చేస్తున్నారు అంటూ క్లారిటీ ఇచ్చారు.ఇక ఈ విషయం తెలియడంతో చాలా మంది నెటిజన్స్ ఇంత చిన్న వయసులో కృతి శెట్టి పెళ్లి చేసుకోవడం ఏంటి.
ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేసేవారికి కాస్తైనా మైండ్ ఉండాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు.