కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు హైదరాబాద్ కు చేరుకున్నారు.ఈ క్రమంలోనే ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జునఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ తాజ్ కృష్ణకు చేరుకున్నారు.
కాగా తాజ్ కృష్ణ వేదికగా రెండు రోజులపాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే పార్టీ అగ్రనేతలతో పాటు సీడబ్ల్యూసీ సభ్యులు హాజరుకానున్నారు.
మరికాసేపటిలో సమావేశాలు ప్రారంభం కానుండగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలే ఎజెండాగా చర్చలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.అదేవిధంగా రేపు సీడబ్ల్యూసీ సమావేశం ముగిసిన అనంతరం సాయంత్రం తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభను నిర్వహిస్తుంది.
ఈ సభా వేదికపై నుంచి సోనియా గాంధీ ఐదు గ్యారెంటీ పథకాలను ప్రకటించనున్నారని ఇప్పటికే పార్టీ వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే.







