తేదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా కర్ణాటక రాష్ట్రం, బెంగళూరులోని ఫ్రీడం పార్కు వద్ద ఐటి ఉద్యోగస్థులు భారీగా చేరుకొని నిరసన తెలిపారు.ఐటీ ఉద్యోగులతో పాటూ బెంగళూరు, జయనగర్ లో స్థిరపడిన తెలుగు ప్రజలు చేరుకొని నిరసన తెలిపారు.
అనంతరం స్థానిక వినాయక స్వామి ఆలయంలో చంద్రబాబు త్వరగా విడుదల కావాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.చంద్రబాబుకు తెలుగు ప్రజలు సంఘీభావంగా భారీ ర్యాలీ నిర్వహించారు.







