జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ హోంమంత్రి తానేటి వనిత మండిపడ్డారు.నిన్న పవన్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబుతో మాట్లాడటానికి వెళ్లారా లేక ప్యాకేజీ మాట్లాడటానికి వెళ్లారా అని ప్రశ్నించారు.
చంద్రబాబు చెప్తేనే పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేస్తున్నారని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు.టీడీపీ, జనసేన ఎప్పటినుంచే కలిసే ఉన్నాయని పేర్కొన్నారు.
టీడీపీ నేతలు అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.సెంట్రల్ జైలులో బ్లాక్ మొత్తం చంద్రబాబుకు కేటాయించామన్న ఆమె సీసీ కెమెరాలతో పాటు భద్రత కూడా కట్టుదిట్టంగా ఉందని వెల్లడించారు.







