కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్( Thalapathy Vijay ) ఏ సినిమా చేసిన కూడా కోలీవుడ్ లో సంచలనమే.యావరేజ్ టాక్ వచ్చిన 200 కోట్లను కలెక్ట్ చేసే సత్తా ఉన్న స్టార్ విజయ్.
మరి ఈ స్టార్ హీరో పెద్దగా ప్రమోషన్స్ లో పాల్గొనక పోయిన ఈయన సినిమాలకు క్రేజ్ మాత్రం మాములుగా ఉండదు.అలాంటి హీరో తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) దర్శకత్వంలో ‘లియో’ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.

లోకేష్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రకటించినప్పటి నుండే భారీ డిమాండ్ ఉంది.ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అందరిని ఆకట్టుకోగా అంచనాలు సైతం పెరిగిపోయాయి.ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడే లోపు ఈ సినిమా కోసం భారీ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.
వచ్చే నెలలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మలేషియాలో గ్రాండ్ గా నిర్వహించాలని మేకర్స్ భావిస్తున్నారట.
ఎందుకంటే విజయ్ తన సినిమా కోసం ఎప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వరు.ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని సినిమాపై భారీ హైప్ పెంచేస్తారు.
అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహిస్తారు.ఈ సినిమాకు కూడా మలేషియాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
అక్టోబర్ 14న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్నట్టు తెలుస్తుంది.

ఈ ఈవెంట్ లో యూనిట్ మొత్తం పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది.చూడాలి మేకర్స్ ఏం చేస్తారో.సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష ( Trisha )హీరోయిన్ గా నటిస్తుందిగా అనిరుద్ రవిచంద్రన్ ( Anirudh Ravichander )సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాను అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.







