హైదరాబాద్ లోని మాదాపూర్ డ్రగ్స్ పార్టీ కేసులో యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారుల విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా సినీ హీరో నవదీప్ కు యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అధికారుల ముందు హాజరు అవుతానని చెప్పిన నవదీప్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని తెలుస్తోంది.అనంతరం తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని నవదీప్ ట్వీట్ చేశారు.
అదేవిధంగా బేబీ సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్ రాజేశ్ కు అధికారులు నోటీసులు ఇచ్చారని సమాచారం.ఈ క్రమంలోనే సామాజిక బాధ్యతతో సినిమాలు తీయాలని పోలీసులు కోరారు.
మాదాపూర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో సినీ ఫైనాన్షియర్ వెంకట్ డ్రగ్స్ పార్టీ నిర్వహించారు.ఈ క్రమంలోనే డ్రగ్స్ తో ఎవరెవరికీ సంబంధం ఉందనే వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది.







