హీరో నవదీప్‎కు యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారుల నోటీసులు..!

హైదరాబాద్ లోని మాదాపూర్ డ్రగ్స్ పార్టీ కేసులో యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారుల విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది.

ఇందులో భాగంగా సినీ హీరో నవదీప్ కు యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో అధికారుల ముందు హాజరు అవుతానని చెప్పిన నవదీప్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని తెలుస్తోంది.

అనంతరం తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని నవదీప్ ట్వీట్ చేశారు.

అదేవిధంగా బేబీ సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్ రాజేశ్ కు అధికారులు నోటీసులు ఇచ్చారని సమాచారం.

ఈ క్రమంలోనే సామాజిక బాధ్యతతో సినిమాలు తీయాలని పోలీసులు కోరారు.మాదాపూర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో సినీ ఫైనాన్షియర్ వెంకట్ డ్రగ్స్ పార్టీ నిర్వహించారు.

ఈ క్రమంలోనే డ్రగ్స్ తో ఎవరెవరికీ సంబంధం ఉందనే వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది.