తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి( Heroine Sai Pallavi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సాయి పల్లవి ప్రస్తుతం అడపదడపా సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.
చివరగా సాయి పల్లవి గార్గి, విరాటపర్వం సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.రెండు సినిమాలు గత ఏడాది విడుదల అయిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది పూర్తవుతున్న కూడా ఇప్పటివరకు సాయి పల్లవి కి సంబంధించిన మూవీ అప్డేట్స్ కానీ సినిమా కానీ విడుదల కాలేదు.సాయి పల్లవి సినిమాలకు ఇంత గ్యాప్ ఎందుకు ఇచ్చిందా అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి.
ఇది ఇలా ఉంటే సాయి పల్లవికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
అదేమిటంటే.ఇప్పటివరకు కేవలం తెలుగు, తమిళం,మలయాళ సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయి పల్లవి త్వరలోనే బాలీవుడ్( Sai Pallavi Bollywood Entry ) కి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది.ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సాయి పల్లవి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆమె ఒక స్టార్ హీరో కొడుకు నటిస్తున్న సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతుందట.ఆ స్టార్ హీరో తనయుడు మరెవరో కాదు అమీర్ ఖాన్ తనయుడు జునైట్ కాంత్( Junaid Khan ). ఆయన నటిస్తున్న తొలి చిత్రం యాష్ ఫిల్మ్ నిర్మిస్తోంది.అయితే ఈ సినిమా ఇంకా పూర్తవ్వకముందే ఆయన మరో సినిమాకి కమిట్ అయ్యాడు.
ఈ సినిమాని సునీల్ పాండే తెరకెక్కించబోతున్నారట.ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవిని చూస్ చేసుకున్నారట.
ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఒకవేళ ఈ వార్త కనుక నిజమైతే సాయి పల్లవి అభిమానులకు ఇంతకు మించిన గుడ్ న్యూస్ మరొకటి ఉండదని చెప్పవచ్చు.కానీ ఇక్కడే అభిమానులకు అసలైన భయం మొదలయ్యింది.ఎందుకంటే టాలీవుడ్ ఇండస్ట్రీ( Tollywood Industry )లో ఉన్నంతవరకు హీరోయిన్స్ చాలా చక్కగా ఉంటారు.కానీ ఎప్పుడైతే బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తారో అప్పుడే హీరోయిన్స్ హద్దులు మీరి పోతారని,బాలీవుడ్ ప్రపంచం అంటే అలానే ఉంటుందని ఇప్పుడు హీరోయిన్ సాయి పల్లవి కూడా అదే లిస్టులోకి యాడ్ అవ్వబోతుందని గతంలో ఎంతో మంది ఇండస్ట్రీలో హీరోయిన్స్ టాలీవుడ్ లో ఉన్నంతవరకు చక్కగా ఉండి బాలీవుడ్ కి వెళ్ళాక మారిపోయిన సంగతి గుర్తు చేసుకుంటున్నారు.ఒకవేళ అందరూ అనుకుంటున్నారు అదే గనుక జరిగితే ఇప్పటివరకు కేవలం పద్ధతిగా చూసిన సాయి పల్లవిని హాట్ గా బికినీలో రొమాంటిక్ యాంగిల్( Romantic Angle ) లో కూడా చూడాల్సి వస్తుంది.
ఈ విషయంలో అభిమానులు కాస్త భయపడుతున్నారు.మరి సాయి పల్లవి ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా గ్లామర్ షో చేయలేదు.
అలాంటి సినిమాలను కూడా రిజెక్ట్ చేస్తూ వచ్చింది.మరి ఇప్పుడు బాలీవుడ్ సినిమా కోసం ఆ రూల్స్ ని బ్రేక్ చేయనుందా లేదా అన్నది చూడాలి మరి.