ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు( Andhra Pradesh State Politics ) గడిచిన వారం రోజుల్లో ఈ రేంజ్ లో మారిపోతాయని ఎవ్వరూ ఊహించలేక పోయారు.చంద్ర బాబు నాయుడు అరెస్ట్ నిజంగా ఊహించనిదే.
ప్రస్తుతం రాజముండ్రి జైలు లో ఉంటున్న చంద్రబాబు నాయుడు ని నేడు ఉదయం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కలిసి, ఆయనతో కాసేపు చర్చించి, వైసీపీ( YCP ) అరాచక పాలన పై మీడియా సమావేశం లో కడిగిపారేసి, ఆ తర్వాత వచ్చే ఎన్నికలు డిసెంబర్ లో ఉన్నా, లేదా ఏప్రిల్ లో ఉన్నా తెలుగు దేశం మరియు జనసేన పార్టీలు కలిసే పోటీ చేస్తాయి.ఇలాంటి దుర్మాగపు పాలన నుండి బయటపడాలంటే కచ్చితంగా అన్నీ పార్టీలు ఏకం అవ్వాలి.
నేడు అదే జరుగుతుంది అంటూ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చెప్పుకొచ్చాడు.ఇకపోతే ఎప్పుడైతే ఆయన ఈ ప్రకటన చేసాడో అప్పటి నుండే సీట్ షేరింగ్ మరియు పవర్ షేరింగ్ గురించి చర్చలు మొదలయ్యాయి.

అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తెలుగు దేశం పార్టీ జనసేన పార్టీ కి 50 సీట్లు.అలాగే రెండేళ్లు ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతునట్టుగా తెలుస్తుంది.దీని గురించి రేపటి నుండి ఉమ్మడి కమిటీ లో చర్చలు జరపబోతున్నారు.ప్రస్తుతానికి అయితే ఈ పొత్తు కి న్యాయకత్వం వహించేది పవన్ కళ్యాణ్ అని బలంగా సంకేతాలు అందుతున్నాయి.
ఈరోజు ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు చూస్తుంటే ఎవరికైనా అలాగే అనిపిస్తాది.ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ ఉన్న క్లిష్టమైన పరిస్థితి లో పవన్ కళ్యాణ్ మాత్రమే పొట్టుని విజయవంతంగా ముందుకు నడపగలడు అని ఇరువురి పార్టీల కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
ఒకవేళ పవన్ కళ్యాణ్ ముఖ్య మంత్రి అభ్యర్థి అయితే తెలుగు దేశం పార్టీ శ్రేణులు జీర్ణించుకోగలరా.?, వాళ్ళ ఓట్లు కూటమి కి ఒక్కటి కూడా డివైడ్ కాకుండా పడుతుందా లేదా అనేది చూడాలి.

మరి పవన్ కళ్యాణ్ రాబొయ్యే రోజుల్లో ఈ కూటమిని ఎలా ముందు ఉంది నడిపిస్తాడో చూడాలి, ఈ కూటమి లో పవన్ కళ్యాణ్ ని మించి అద్భుతంగా ప్రసంగాలు ఇచ్చే నాయకులు ఎవరూ లేరు.సమస్యల గురించి అనర్గళంగా ఆయన రేంజ్ లో ఎవ్వరూ మాట్లాడలేరు.కాబట్టి కచ్చితంగా ఆయన ప్రభావం కూటమి కి అత్యధిక స్థానాలను గెలిచేలా చేస్తుంది అని చెప్పొచ్చు.అందుతున్న సమాచారం ప్రకారం ముందస్తు ఎన్నికలు ఉండే అవకాశం కూడా ఉందట.
అక్టోబర్ లో వైసీపీ పార్టీ ప్రభుత్వాన్ని రద్దు చేయబోతోందని టాక్ కూడా వినిపిస్తుంది.అందుకే ఆలస్యం చెయ్యకుండా నేడు పొత్తు గురించి అధికారిక ప్రకటన చేసాడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.
ఒకవేళ డిసెంబర్ లో ఎన్నికలు వస్తే ఈ కూటమి కి ఎన్ని స్థానాలు వస్తాయో చూడాలి.







