Seniour NTR : సీనియర్ ఎన్టీఆర్ కి పెద్దకాపు సినిమాకి ఇంత అనుబంధం ఉందా?

శ్రీకాంత్ అడ్డాల పరిచయం అవసరం లేని పేరు ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి శ్రీకాంత్ అడ్డాల ( Sreekanth Addaala ) తాజాగా పెద్దకాపు ( Pedda kaapu ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సినిమాకు ఈయన దర్శకత్వం వహించడమే కాకుండా నటుడిగా కూడా నటించారు.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.

 Is This The Relationship Between Senior Ntr And Peddha Kapu 1 Movie-TeluguStop.com

ఈ సినిమా ఈనెల 29వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.

Telugu Chota, Kothabangaru, Peddha Kapu, Sr Ntr, Tollywood-Movie

ఇదిలా ఉండగా తాజాగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన పెద్దకాపు సినిమాకి సీనియర్ ఎన్టీఆర్ ( Seniour NTR ) కి సంబంధం ఉందని తెలుస్తోంది.మరి ఈ సినిమాకి దివంగత నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అనే విషయానికి వస్తే.తాజాగా పెద్దకాపు సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసినటువంటి చోటా కె నాయుడు( Chota K Naidu ) ఒక సందర్భంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టారు… శ్రీకాంత్ అడ్డాల తండ్రి సీనియర్ ఎన్టీ రామారావుకు వీరాభిమాని.

ఎన్టీఆర్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగినప్పుడు కూడా అలాగే ఆయన రాజకీయాలలోకి వెళ్ళినప్పుడు కూడా ఎన్టీఆర్ కి ఎంతో చేదోడువాదోడుగా ఉన్నారు.

ముఖ్యంగా ఎన్టీఆర్ పార్టీ పెట్టిన సమయంలో శ్రీకాంత్ అడ్డాల తండ్రి ఎన్టీఆర్ వెంటే ఉంటూ ఆ సమయంలో ఎన్టీఆర్ ఏ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు అనే విషయాలను కళ్లారా చూశారు.

అయితే ఈ విషయాలన్నింటిని తండ్రికి దగ్గరగా ఉంటూ తెలుసుకున్నటువంటి శ్రీకాంత్ అడ్డాల అదే కథతోనే ఈ పెద్దకాపు అనే సినిమాని తెరకెక్కించారు.ఇలా ఎన్టీఆర్ అనుభవించిన కష్టాలను ఆసరాగా చేసుకొని ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని ఈ సినిమా తప్పకుండా హిట్ అందుకుంటుంది అంటూ చోటా కె నాయుడు చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Telugu Chota, Kothabangaru, Peddha Kapu, Sr Ntr, Tollywood-Movie

ఇక శ్రీకాంత్ అడ్డాల బంగారు లోకం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.ఈ సినిమా తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు( Seethamma Vakitlo Sirimalle Chettu ) సినిమాకు దర్శకత్వం వహించారు ఈ సినిమా కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.అయితే చాలా రోజుల తర్వాత శ్రీకాంత్ అడ్డాల పెద్దకాపు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు నటుడిగాను దర్శకుడుగాను రాబోతున్నారు మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube