ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తుతో కలిసి పోటీ చేయనున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.దీనిపై స్పందించిన అధికార పార్టీ వైసీపీ ఓ ట్వీట్ చేసింది.
ప్యాకేజీ బంధం బయటపడిందని వైసీపీ ట్వీట్ లో పేర్కొంది.టీడీపీతో పొత్తు ఖాయం చేసుకునేందుకే రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి పవన్ చంద్రబాబును కలిశారని తెలిపింది.
పవన్ ను నమ్ముకున్న అభిమానుల భ్రమలు తొలిగాయని స్పష్టం చేసింది.ఇది పొత్తులు, ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధమని వెల్లడించింది.
ఈ క్రమంలో మిమ్మల్ని మూకుమ్మడిగా ఏపీ నుంచి తరిమికొట్టడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది.







