బాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు అందరూ కూడా పెద్ద ఎత్తున ముంబైలో ఆస్తులను పోగు చేస్తూ ఉంటారు.ఈ విధంగానే చాలామంది సెలబ్రిటీలు ముంబైలో ఖరీదైనటువంటి ప్రాంతంలో ఇంటిని కొనుగోలు చేస్తూ పెద్ద ఎత్తున వాటి ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు.
ఈ విధంగానే ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ముంబైలో పలు ప్రాంతాల్లో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేస్తూ వాటిని అద్దెకు ఇస్తూ అద్దె ద్వారా భారీగా సంపాదిస్తూ ఉంటారు.తాజాగా నటి సోనాక్షి సిన్హా( Sonakshi Sinha )సైతం ముంబైలో ఖరీదైన ప్రాంతంలో ఓ ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ముంబై( Mumbai ) లో ఎక్కువగా సెలబ్రిటీలో బాంద్రాలో ఇంటిని కొనుగోలు చేస్తూ ఉంటారు.ఈ ప్రాంతంలో సముద్రతీరం ఉండడంతో ఇక్కడ ఎంతో అద్భుతమైన వాతావరణం ఉంటుందన్న కారణంతో చాలా మంది సెలబ్రిటీలు ఈ ఏరియాలో ఇంటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు.ఈ క్రమంలోనే నటి సోనాక్షి సైతం సాగర తీరాన ఏకంగా 11 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఓ అందమైన ఇంటిని కొనుగోలు చేశారని తెలుస్తోంది.బాంద్రాలోని ఆరియాట్ భవనంలో ఓ లగ్జరీ ఫ్లాట్ కోసం రూ.55 లక్షల విలువైన స్టాంప్ డ్యూటీని కూడా చెల్లించింది.ఈ ఏడాది ఆగస్టులో రిజిస్ట్రేషన్ జరిగినట్లు తెలుస్తోంది.

ఈమె కొనుగోలు చేసిన ఈ ఫ్లాట్ లో అన్ని ఆధ్యాత్మిక సౌకర్యాలతో ఉందని తెలుస్తోంది అలాగే నాలుగు కార్ల పార్కింగ్ కూడా సరిపడా స్థలం ఉందని తెలుస్తోంది.లాబీతో పాటు ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ కూడా ఉంది.ఇలా అన్ని సౌకర్యాలు ఉండడంతో ఈమె ఏకంగా 11 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ ఫ్లాట్ కొనుగోలు చేశారు అయితే ఇదివరకే సోనాక్షి 2020లో కూడా రూ.14 కోట్లకు బాంద్రాలో విలాసవంతమైన ఓ ఫ్లాట్ కొనుగోలు చేశారు తాజాగా మరొక ఫ్లాట్ కొనుగోలు చేశారని బాలీవుడ్ మీడియా( Bollywood )లో ఈ వార్త వైరల్ గా మారింది.







