ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) అరెస్ట్ అయినటువంటి విషయం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పెద్ద ఎత్తున చర్చలకు కారణమవుతుంది.చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు రావడంతో సిఐడి అధికారులు ఆధారాలతో సహా చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో( Rajahmundry ) ఉండగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ విషయం చర్చలకు కారణమైంది.
ఈ క్రమంలోనే కొందరు చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంపై స్పందిస్తూ వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు చేస్తున్న తప్పులకు పాపం పండింది అంటూ కొందరు కామెంట్లు చేయక కొందరు మాత్రం కక్ష సాధింపు చర్యలలో భాగంగా చంద్రబాబు నాయుడుని అరెస్టు చేశారు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.అయితే చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో నారా నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా స్పందించినప్పటికీ ఎన్టీఆర్( NTR )కళ్యాణ్ రామ్( Kalyan Ram )మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.

ఇదిలా ఉండగా థాంక్యూ జగన్ అంటూ ఎన్టీఆర్ కు సంబంధించినటువంటి ఒక పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంపై మరికొందరు కామెంట్లు చేస్తూ తారకరత్న ( Tarakaratna ) ఉసురు చంద్రబాబునాయుడుకు తగిలిందని అందుకే ఫలితం అనుభవిస్తున్నారు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ( Lokesh )పాదయాత్ర ప్రారంభించిన రోజే తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి మనకు తెలిసిందే.ఇక ఈయన గుండెపోటుకు గురి కావడంతో దాదాపు 23 రోజుల తర్వాత చనిపోయారని ప్రకటించారు.

ఇలా గుండెపోటుకు గురైనటువంటి వ్యక్తి ఇన్ని రోజులపాటు హాస్పిటల్లో చికిత్స తీసుకొని చివరికి మరణించారని విషయం తెలియడంతో ఎంతోమంది ఈయన మరణం పై సందేహాలు వ్యక్తం చేశారు.తారకరత్న మొదటి రోజు చనిపోయారని అది అనౌన్స్ చేస్తే తన కొడుకు పాదయాత్రకు భంగం కలుగుతుందన్న ఉద్దేశంతోనే చంద్రబాబునాయుడు ఇన్ని రోజులు హై డ్రామా ఆడారు అంటూ కూడా కొందరు సందేహాలు వ్యక్తం చేశారు.అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడంతో తారకరత్న ఉసురు తగిలిందని తారకరత్న మరణించిన రోజే చంద్రబాబు నాయుడు కూడా జైలుకు వెళ్లారు అంటూ కొందరు ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు.

తారకరత్న జనవరి 27వ తేదీ గుండెపోటుకు గురయ్యారు.అనంతరం ఆయనని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు అనంతరం ఫిబ్రవరి 18వ తేదీ తారకరత్న చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు.అయితే చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అరెస్టు అయ్యారు మరి ఆయన మరణానికి చంద్రబాబు అరెస్టుకు కారణం ఏంటి అని కూడా ఆలోచిస్తున్నారు.
తారక త్న 27 వ తేదీ అంటే 2+7= 9 అని వస్తుంది ఆ రోజు గుండెపోటుకు గురయ్యారు.ఇక ఈయన మరణించిన తేదీని అధికారికంగా ప్రకటించింది 18 వ తేదీ ఈ రెండింటిని కూడితే 9 వస్తుంది.
ఇక చంద్రబాబు నాయుడు కూడా 9వ తేదీ అరెస్టు కావడంతో పలువురు ఈ విషయాన్ని తెరపైకి తీసుకువస్తూ తారకరత్న శాపమే ఈయనని జైలు పాలు చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.







