రాజస్థాన్ లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది.బస్సును ఓ లారీ ఢీకొట్టింది.
భరత్ పూర్ జిల్లాలోని హంత్రా దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారని తెలుస్తోంది.పలువురు గాయపడ్డారు.
కాగా భావ్ నగర్ నుంచి మధుర వెళ్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.అనంతరం స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అదేవిధంగా ప్రమాదంపై కేసు నమోదు చేసి యాక్సిడెంట్ జరగడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.







