క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ ను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ నిరాకరించిందని తెలుస్తోంది.ఇవాళ కమల తీర్థం పుచ్చుకునేందుకు చీకోటి ప్రవీణ్ భారీ ర్యాలీగా బీజేపీ కార్యాలయానికి వెళ్లారు.
అయితే బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జ్ ప్రకాశ్ జవదేకర్ పార్టీ కార్యాలయానికి వెళ్లారు.చీకోటి ప్రవీణ్ చేరిక అంశం తెలిసిన ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అనంతరం చీకోటి ప్రవీణ్ చేరికను వెంటనే ఆపాలని కార్యాలయ సిబ్బందిని ఆదేశించారని తెలుస్తోంది.ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సమక్షంలో చీకోటి పార్టీలో చేరాల్సి ఉంది.
అయితే కొన్ని అనివార్య కారణాల వలన కిషన్ రెడ్డి పార్టీ కార్యాలయానికి రాకపోగా అంతవరకు పార్టీ ఆఫీస్ లో ఉన్న ఈటల సైతం బయటకు వెళ్లిపోయారు.దీంతో చీకోటి చేరిక అంశంపై సందిగ్ధత నెలకొంది.