దేవదాసు( Devadasu ) సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు గోవా ముద్దుగుమ్మ ఇలియానా( Ileana ) ఈ సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఇలియానా అనంతరం పూరి జగన్నాథ దర్శకత్వంలో మహేష్ బాబు( Mahesh Babu ) హీరోగా నటించిన పోకిరి సినిమా( Pokiri Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఇలియానా ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా మారిపోయారు.
ఈ విధంగా ఈమెకు తెలుగు తమిళ భాష చిత్రాలలో వరుసగా అవకాశాలు రావడంతో సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అయ్యారు.

ఈ విధంగా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగినటువంటి ఈమె అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పలు సినిమాలలో నటించారు.అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈమె సినిమాలపై ఫోకస్ చేయలేకపోయింది దీంతో కెరియర్ మొత్తం దెబ్బతినిందనే చెప్పాలి.ఇలా కెరియర్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఇలియానా సోషల్ మీడియా( Social media)లో పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తూ వచ్చారు.
అయితే ఉన్నఫలంగా తాను ప్రెగ్నెంట్ అనే బాంబు పేల్చి అందరికీ షాక్ ఇచ్చారు.

ఇలియానా పెళ్లి చేసుకుందా లేదా అన్న విషయాన్ని ఇప్పటికే రహస్యంగా ఉంచారు.అయితే ఈమె మాత్రం ప్రెగ్నెంట్ కావడం కొడుకుకు జన్మనీవ్వడం కూడా జరిగిపోయింది.ఇక తన బాయ్ ఫ్రెండ్ ఫోటో కూడా రివీల్ చేసినటువంటి ఈమె తన గురించి ఎలాంటి విషయాలను మాత్రం అభిమానులకు తెలియజేయలేదు ప్రస్తుతం కొడుకు ఆలనా పాలన చూసుకుంటూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఇలియానా గతంలో ఒక ఇంటర్వ్యూలో భాగంగా టాలీవుడ్ డైరెక్టర్ల గురించి చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ సందర్భంగా యాంకర్ ఈయన ప్రశ్నిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి డైరెక్షన్లో మీరు నటించారు.అయితే ఏ డైరెక్టర్ కూడా మీకు సరైన గుర్తింపు ఇచ్చే పాత్ర ఇవ్వలేదంటారా అంటూ ప్రశ్నించారు ఈ ప్రశ్నకు ఇలియానా సమాధానం చెబుతూ తాను ఎలాంటి పాత్రలోనైనా అద్భుతంగా నటిస్తాను కానీ తెలుగు సినిమా డైరెక్టర్లు అందరూ కూడా తనలో నటన కన్నా నా నడుము ఎన్ని యాంగిల్స్ లో చూపించాలి అనేదానిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు.వాళ్ళకి ఎప్పుడు నా సన్నని నడుము మీదే దృష్టి ఉంటుంది అంటూ తెలుగు డైరెక్టర్లపై ఇలియానా సంచలన వ్యాఖ్యలు చేశారు.ఒకప్పుడు సన్నజాజి తీగల ఎంతో నాజూగ్గా ఉన్నటువంటి ఈమె నడుముకు కూడా విపరీతమైనటువంటి అభిమానులు ఉండేవారు అందుకే డైరెక్టర్లు ఈమె నడుము పైనే ఫోకస్ చేసే వారిని చెప్పాలి.
ఏది ఏమైనా టాలీవుడ్ డైరెక్టర్ల గురించి ఇలియానా ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అయ్యాయి.







