ఏపీ సీఎం జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికే చంద్రబాబును అరెస్ట్ చేశారని టీడీపీ నేత యనమల అన్నారు.అయితే తమ నాయకుడు చంద్రబాబుకు ఏదైనా హాని కలిగితే పూర్తి బాధ్యత జగన్ దేనని పేర్కొన్నారు.
రాజధాని అంశంతోనే ఏపీలో విధ్వంస పాలన మొదలైందని యనమల ఆరోపించారు.రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆస్తులను పెంచుకోవాలని చూస్తున్నారన్నారు.
వైసీపీ పాలనలో ఏపీకి భవిష్యత్ ఉండదన్న యనమల సీఐడీని జగన్ తన జేబు సంస్థగా మార్చారని విమర్శించారు.ఈ క్రమంలోనే సీఐడీ అధికారులు వ్యవహారిస్తున్న తీరు సరికాదని వెల్లడించారు.
కక్ష సాధింపు చర్యలో భాగంగానే చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.







