కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dilipkumar) దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన తాజా చిత్రం జైలర్( Jailer ) ఈ సినిమా ఆగస్టు 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా విడుదలయి నెలరోజులు అయినప్పటికీ ఇంకా థియేటర్లలో ఈ సినిమా హవా మాత్రం తగ్గడం లేదు.
ఇలా ఈ సినిమాకు ఊహించని విధంగా పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన కలెక్షన్స్ రావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.రోబో సినిమా తరువాత రజినీకాంత్ ఈ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టిన సినిమా ఇదే అని చెప్పాలి.
ఈ విధంగా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో నిర్మాత ఎంతో ఆనందంలో ఉన్నారు.

ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్ కళానిధి మారన్(Kalanidhi Maran) ఈ సినిమాలో అందుకున్నటువంటి లాభాలను పెద్ద ఎత్తున చిత్ర బృందానికి అందజేస్తూ ఉన్నారు.ఇప్పటికే రజనీకాంత్ కు 210 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇవ్వగా కోటిన్నర విలువచేసే ఖరీదైన కారును కూడా బహుమానంగా అందజేశారు.అదేవిధంగా దర్శకుడు నెల్సన్ అలాగే సంగీత దర్శకుడు అనిరుద్ కి ( Anirudh ) సైతం ఖరీదైన కార్లతో పాటు అదనంగా రెమ్యూనరేషన్ అందజేసిన సంగతి మనకు తెలిసిందే.
అదేవిధంగా కోటి రూపాయలు అపోలో హాస్పిటల్స్ కు విరాళంగా ఇచ్చారు.

ఇలా ఈ సినిమాలో వచ్చినటువంటి లాభాలను నిర్మాత చిత్ర బృందానికి కూడా వివిధ రకాలుగా కానుకలు అందజేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే జైలర్ సినిమా కోసం పని చేసినటువంటి 300 మంది ఆర్టిస్టులకు ఈయన ఏకంగా గోల్డ్ కాయిన్స్( Gold Coins ) అందజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఈ సినిమా 10వ తేదీకి విడుదల అయ్యి నెలరోజులు పూర్తి కావడంతో సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇందులో భాగంగా ఈ సినిమా కోసం పని చేసినటువంటి ప్రతి ఒక్క ఆర్టిస్టుకు ఈయన కాయిన్స్ అందజేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.







