ఇక వార్ వన్ సైడ్ ఏనా?

చంద్రబాబు( Chandrababu Naidu Arrest )పై ఏపీ ప్రభుత్వం దూకుడు తాత్కాలికంగా తెలుగుదేశానికి ఇబ్బందికరమైన పరిణామమైనప్పటికీ వచ్చే ఎన్నికల కోణంలో చూస్తే మాత్రం చంద్రబాబు నెత్తిన పాలు పోసే పరిణామమే ఇది అంటూ పొలిటికల్ వ్యూహ కర్తలు వ్యాఖ్యానిస్తున్నారు.ముఖ్యంగా రెండు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలను తెలుగు మీడియా రిపోర్ట్ చేస్తున్న విధానం చూస్తే ఒక 75 సంవత్సరాల ముసలి వ్యక్తిపై అధికార వైసీపీ పగ తీర్చుకుంటుంది అని ఆయనను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగాని ఇబ్బంది పెడుతుందని చాలా దురుసుగా ముందుకు వెళ్తుంది అన్న కోణంలో తెలుగుదేశం అనుకూల మీడియా కథనాలు ప్రచారం చేస్తుంది .

 Is War Onside From Now, Chandrababu Naidu Arrest , Tdp, Ycp, Welfare Schemes ,-TeluguStop.com

అంతేకాకుండా ప్రతీకార రాజకీయాలకు తెరతీసారని ఇక రాబోయే కాలంలో కూడా ఇలాంటి అనేక పరిణామాలను అధికార పార్టీ ప్లాన్ చేస్తుందని మరోసారి ఈ పార్టీకి అవకాశం ఇస్తే దేశాన్ని రావణకాష్టంగా మార్చేస్తారు అంటూ తెలుగుదేశం అధికార ప్రతినిధులు అనేక వార్తా చానల్లో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు .

Telugu Chandrababu, Bhuvaneshwari, Lokesh, Welfare Schemes, Ys Jagan-Telugu Poli

తెలుగుదేశం( TDP party ) స్పందనను పక్కకు పెడితే సాధారణ ప్రజల్లో కూడా చంద్రబాబు పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్నది రాజకీయ ప్రతీకారం అన్న కోణంలోనే చర్చ జరుగుతుంది ముఖ్యంగా ఆయనపై పెట్టిన కేసు టెక్నికల్గా బలంగానే ఉన్నప్పటికీ ప్రజల చర్చలలో మాత్రం ఇది ఒక చిన్న కేసు లాగానే కనిపిస్తుంది.ఎందుకంటే రాజకీయ అవినీతి అంటే వేల కోట్ల వ్యవహారం గా మారిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఒక 180 కోట్ల వ్యవహారం ప్రజలకు చిన్నగానే కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది.ఒకప్పటి తన అరెస్టుకు ప్రతీకారంగానే జగన్ ఈ విధంగా కథను నడిపించారని ముఖ్యంగా చంద్రబాబు పెళ్లిరోజుకు ముందు అరెస్టు చేయించడం, రెండు రోజుల కోర్టు సెలవులను ఉపయోగించుకోవాలని చూడటం, పకడ్బందీగా వ్యవహారాలను ప్లాన్ చేయడం, తాను రాష్ట్రంలో ఉండకుండా విదేశాలకు వెళ్లడం వంటి పరిణామాలు ఇవన్నీ ప్లాన్ ప్రకారమే వ్యూహాత్మకంగా జరిగిన వ్యవహారాలుగా చాలామంది విశ్లేషిస్తున్నారు.

Telugu Chandrababu, Bhuvaneshwari, Lokesh, Welfare Schemes, Ys Jagan-Telugu Poli

ఇప్పటికే మౌలిక సదుపాయాలు కల్పనలోనూ, ఉద్యోగ కల్పనలోనూ, పారిశ్రామిక అభివృద్ధిలోనూ అనేక విమర్శలను మూట కట్టుకుంటున్న ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాల ( Welfare schemes )ఫలితాలతోనే గట్టేక్కాలని చూస్తుంది.ఇలాంటి సమయంలో ఇలా రాజకీయ ప్రత్యర్ధుల పట్ల దూకుడు గా వ్యవహరించడం ఆ పార్టీకి ఎన్నికల కోణంలో చూస్తే మంచిది కాదని వార్తలు వస్తున్నాయి.తెలుగుదేశానికి ఈ పరిణామం వల్ల భారీగా లబ్ది చేకూరుతుందని, ఒకరకంగానిన్నటి వరకూ సమానం గా ఉన్న అదికార ప్రతిపక్ష బాలబలాల లో తెలుగు దేశాం వైపు మొగ్గు కనిపించే పరిస్థితి ఇప్పుడు ఏర్పడినట్టుగా పోలీటికల్ పరిశీలకులు వాఖ్యనిస్తున్నారు .తెలుగు దేశం హార్డ్ కోర్ ఫాన్స్ లో కూడా ఒక రకమైన పట్టుదల పెరిగే వ్యవహారంగా ఇది మారిపోయిందని, వారు ఇప్పుడు తమ ప్రాణాలకు తెగించి తెదేపా గెలుపు కోసం పోరాడే విధంగా వారికి స్ఫూర్తిని ఇస్తుందని కూడావార్తలు వస్తున్నాయి .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube